ప్రెస్ నోట్...
👉 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా...
నేడు వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని .. స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో... అంగరంగ వైభవంగా నిర్వహించారు...
♦️ముఖ్య అతిథులుగా హాజరైన విద్యుత్ శాఖా lమాత్యులు.. గుంటకండ జగదీశ్ రెడ్డి
గారు...
నల్లగొండ శాసనసభ్యులు...
కంచర్ల భూపాల్ రెడ్డి గారు.
విద్యుత్ శాఖామాత్యులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడకు ముందు సర్కార్ ధావాఖానాల పరిస్థితి ఎలా ఉండినో... నేడు ఎలాంటి మార్పులు చెందాయో.. వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని.. నేడు తల్లుల, శిశువుల మరణాలు... గణ నీయంగా తగ్గాయని, ఇందుకు వైద్యులను అభినందిస్తున్నామన్నారు.. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా.. అన్ని వసతులను సర్కారు దవాఖానాల్లో కల్పించారని...
ఒకప్పుడు కేవలం 16 మంది వైద్యులతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి ఉండేదని.. నేడు మెడికల్ కళాశాల ఏర్పడిన తర్వాత 200 పైగా డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో.... వైద్య విద్యార్థులతో... సకల వసతులతో...నడుస్తుందని... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు చేస్తున్నారంటే... వైద్య రంగంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతటి ప్రగతి సాధించామో అర్థమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్యశాల లను.. తెలంగాణ రాష్ట్రం కలిగి ఉందని... దేశంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్యరంగం తలమానికం కాబోతుందని అన్నారు...
కంచర్ల మాట్లాడుతూ....
గత 20 సంవత్సరాలుగా నల్లగొండకు మెడికల్ కళాశాల తీసుకొస్తామని... ఉత్తరప్రగల్పాలు పలికిన నాయకులు.. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారే తప్ప... నల్లగొండకు వరగబెట్టింది ఏమీ లేదని.. ఏడు నూట పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో... అత్యాధునిక వసతులతో కూడిన మెడికల్ కళాశాల 42 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శర వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవని...
కరోనా సమయంలో., డాక్టర్లు నర్సులు... తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని ఇందుకు వారిని..
అభినందిస్తున్నామన్నారు...
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి.. అత్యాధునికసౌకర్యాలతో...
సమర్థవంతంగా రోగులకు సేవలు అందిస్తుందని... ప్రస్తుతం 800 ప్రసవాలు MCH లో జరుగుతున్నావని ఈ సంఖ్యను 1000 వరకు పెంచాలని డాక్టర్లను కోరారు....
ఈ సందర్భంగా...ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి మెమోటోలు అందజేశారు...
డి ఎం హెచ్ ఓ... కొండలరావు నాయకత్వంలో... నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలుఆకట్టుకున్నాయి...
స్వయంగా డిఎంహెచ్ ఓ... పాటలు పాడి డాన్స్ లు చేసి... సభికులను ఉర్రూతలూగించారు..
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్.. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి .. హాస్పిటల్ సూపరిండెంట్.. డాక్టర్ లచ్చు నాయక్... స్థానిక కౌన్సిలర్ ఊటుకూరు వెంకట్ రెడ్డి.. పూజిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.