శ్రీ వాసవి సాయి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న: టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లా , అబ్దుల్లా పూర్ మెట్ , బాటసింగారం గ్రామంలో జరిగిన శ్రీ వాసవి సాయి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న: టూరిజం కార్పొరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, IVF తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఈ సందర్భంగా దర్శనము చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనంతరం ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందడం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు.సంక్షేమంలో, అభివృద్ధి లో తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆలయాల్లో జరిగే పూజ కోసం దుప,దీప నైవేద్యం ఖర్చులు కూడా చెల్లిస్తున్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేవాలయాలలో పనిచేసే పేద బ్రాహ్మణులకు, పూజారులకు గౌరవం లభిస్తుందన్నారు.పేద బ్రాహ్మణులను,పూజారుల గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో పని చేసే వారికి నెల నెల జీతాలు కూడా ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని,దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు పాడి పంటలతో విలసిల్లాలని,ప్రజలందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు తెలిపారు.దేశంలో రైతుల, బీదల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారని,తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు దేశంలోనూ అమలు చేయాలని తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలని అన్నారు. భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న కేసీఆర్ గారి నాయకత్వం లో బీఆర్‌ఎస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే, వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం అని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. ప్రెసిడెంట్ కొండా అశోక్,ఊర నరసింహ గుప్త, కొండా చంద్రశేఖర్, చకిలం రమణయ్య, తెలంగాణ టింబర్ డిపో అసోసియేషన్ ప్రెసిడెంట్ సృజన్, నరేష్ గుప్తా, ముక్కా పృద్వికుమార్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు, నవీన్ మరియు ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు..