:] తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో
తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఈ సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు,సుప్రభాత సేవల పైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు. టిటిడి పద్మావతి హృదాలయంలో ఇప్పటి వరకు 1450 గుండే శస్ర్త చికిత్సలు నిర్వహించామని ప్రకటించారు. టీటీడీ కీలక నిర్ణయాలు : దర్శనాలు,సుప్రభాత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాలిక సిద్దం చేసామని ప్రకటించారు.మహరాష్ర్టలోని నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని టిటిడికి మహరాష్ర్ట ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. Odisha train accident: ఒడిశాకు ప్రధాని మోదీ, బీజేపీ తొమ్మిదేళ్ల వేడుకలు రద్దు..!! రూ 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆలయానికి దాతగా రేమాండ్స్ అధినేత సింఘానియ వ్యహరిస్తున్నారని పేర్కొన్నారు. టిటిడి పద్మావతి హృదాలయంలో ఇప్పటి వరకు 1450 గుండే శస్ర్త చికిత్సలు నిర్వహించామని ఈవో వివరించారు. Recommended Video కోరమాండల్ ఘటన పై సీఎం జగన్ ఆరా.. ఎలాంటి సాయం అయినా అందిస్తాం.. బ్రేక్ దర్శనాలపై పరిశీలన : వేసవి ప్రారంభం అయిన తరువాత సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు టీటీడీ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు చేసారు. ఇదే విధానం మరి కొంత కాలం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మార్పు వలన సాధారణ భక్తులకు దర్శనం వేగంగా జరిగే అవకాశం ఏర్పడిందని టీటీడీ చెబుతోంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించాలని., అటు తరువాత.. ఉదయం 8 నుంచి బ్రేక్ దర్శనం అమలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ప్రోటోకాల్ లో ఉన్న వారు వస్తే వారికి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీ సిఫార్సు లేఖలను మాత్రం వారాంతంలో మూడు రోజుల పాటు స్వీకరించటం లేదని ప్రకటించారు.