గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యం లో రైతు సంక్షేమానికి పెద్ద పీట...
దేశానికీ వెన్నెముక రైతు-రైతు కి వెన్నెముఖ గా గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు...
రైతు బంధు పథకం కింద 65 లక్షల మంది రైతుల ఖాతాలోకి 65 వేయిల కోట్ల రూపాయలు జమ...
రైతు భీమా పథకం ద్వారా రైతు మరణించిన 10 రోజుల్లో భీమా వర్తింపు...
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొరకు ప్రతి సంవత్సరం 12000 కోట్లు ఖర్చు...
మిషన్ కాకతీయ ద్వారా 47000 వేయిల చెరువులు పునరుద్ధరణ...
సాగునీటి ప్రాజెక్టులు,చెక్ డ్యామ్ ల నిర్మాణం ద్వారా ఉబికి వస్తున్న భాగర్భ జలాలు...
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండే ఎండల్లో జల కళ సంతరించుకున్న చెరువులు...
రైతు రాజుగా చూడాలని గౌ. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి కోరిక...
దేశం లో గుణాత్మక మార్పు సాధించేందుకు ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్...
నేను స్వయానా రైతు బిడ్డను-రైతుల కష్టాలు నాకు తెలుసు...
రైతు దినోత్సవంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు...
అర్సపల్లి,నిజామాబాద్ అర్బన్.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్సపల్లి లో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్సపల్లి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్నూరుకాపు సంఘం లో రైతులతో నిర్వహించిన సమావేశంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు రైతు దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని, రైతులతో సమావేశాలు నిర్వహించుకొని తెలంగాణ రైతాంగం సాధించిన ప్రగతిని,లక్ష్యాలని,రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యాలని వివరించాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో ఘననీయ పురోగతి సాధించింది.
మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రం లో ఉన్న 47000 చెరువులలో పూడిక తీసి పునరుద్ధరణ చేయడం జరిగింది.
కాళేశ్వరం లాంటి బహుళార్థక ప్రాజెక్టు ని అనతి కాలంలో నిర్మించడం తో మండు వేసవిలో జల కళ సంతరించుకుంది.
సాగునీటి ప్రాజెక్టులు,చెక్ డ్యామ్ లు నిర్మించి నీటిని ఒడిసి పట్టడం తో ఆయాకట్ట కింద పొలాలు పచ్చని తివాచీ ల మారాయి.
తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా దేశానికి అన్నం పెట్టే అన్న పూర్ణగా తెలంగాణ రాష్ట్రం మారింది.భారత దేశంలో ని 56 శాతం మందికి తెలంగాణ అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ.
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు స్వయానా రైతు, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు.
అర్సపల్లి ప్రాంత రైతుల కొరకు నిజాం సాగర్ కెనాల్ 2 కోట్ల 50 లక్షల రూ. లతో ఆధునికరించి పంట పొలాలకు నీటిని అందిస్తున్నాము.
అర్సపల్లి18 మంది రైతులు మరణిస్తే 5 లక్షల చొప్పున 90 లక్షల రూ.రైతు భీమా ని కూడా అందచేయడం జరిగింది.
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అర్సపల్లి ని దత్తత తీసుకొని 2 కోట్ల రూ.లతో అభివృద్ధి పనులు నిర్వహించాము.
అర్సపల్లి లోని ప్రతి కాలనీ లో సీసీ రోడ్డు,డ్రైనేజి లు నిర్మించాము.అర్సపల్లి నుండి జయ లక్ష్మీ టాకీస్ వరకు BT రోడ్డు ని నిర్మించాము.
దుబ్బా నుండి అర్సపల్లి వరకు సెంటర్ మీడియాన్ లతో కూడిన రోడ్డు మంజూరైంది.త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి.
అర్సపల్లి చిరకాల వాంఛ రైల్వే బ్రిడ్జి కూడా మంజూరైంది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి.
ఆధునిక సదుపాయాలతో అర్సపల్లి లో స్మశాన వాటికను నిర్మిస్తున్నాము.పనులు తుది దశకు చేరుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
అర్సపల్లి డివిజన్ లో ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే తప్పక పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,మాజీ మేయర్ ఆకుల సుజాత గారు,స్థానిక కార్పొరేటర్ ముచుకుర్ లావణ్య నవీన్,కార్పొరేటర్ లు ధర్మపురి,మల్లేష్ యాదవ్,విక్రమ్ గౌడ్, రాఘవేందర్,సాయి వర్ధన్, బాబ్ల్యూ ఖాన్, చంద్ర కల,నాయకులు సూదం రవి చందర్,సిర్ప రాజు,రైతు విభాగం నాయకులు చెగంటి గంగాధర్,మల్కాయి సుదర్శన్, సిర్ప లింగం,అసాది అబ్బయ్య,దండు తిరుపతి,బెల్లాల్ అశోక్,పుప్పాల రవి,పంచారెడ్డి సూరి మరియుBRS నాయకులు, రైతులు పాల్గొన్నారు.