అత్యంత వైభవంగా దేవత ప్రతిష్ట పున:శ్చరణ మహోత్సవం..
హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ గారి దివ్య కరకములచే దేవత మూర్తుల ప్రతిష్టపాన..
పండరీ పూర్ విటలేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సందీప్ కులకర్ణి గారిచే ప్రత్యేక పూజలు నిర్వహణ...
3వ రోజు 15000 మందికి అన్న ప్రసాదం వితరణ..
మాక్లూర్:
అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత ప్రతిష్ట పున:శ్చరణ మహోత్సవం సందర్భంగా ఋత్వికులు శ్రీ బ్రహ్మ శ్రీ కుప్ప జగన్నాథ శర్మ గారు మరియు బ్రహ్మ శ్రీ నర్సింల సురేష్ శాస్త్రి గారు శాంతి పాఠము, గణపతి పూజ,కర్మణ: పుణ్యాహవచనము,మంటప స్థాపిత దేవతల ప్రాతః కాల పూజలు,మహా సంకల్ప పఠనం, హోమము,గర్తన్యాసం,రత్నన్యాసం,బీజాన్యాసం,ధాతున్యాసం,సంస్కరాలు నిర్వహించారు.
పునర్వను, నక్షత్రయుక్త, మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తమున సంకల్పిత దేవత,యంత్ర విగ్రహా స్థిర ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ గారి దివ్య కరకములచే నిర్వహించారు.
తదనంతరం నెత్రోనమిలనము, ధృగ్ బలి, ఆవహిత దేవతా, బలి ప్రధానము,ప్రాణ ప్రతిష్ట,కళ న్యాసము,దృష్టి గోదర్శనము,మహా పూర్ణాహుతి,మహదాశీర్వచనము మరియు సన్మానము నిర్వహించినిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారికి, BRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ గారికి మరియు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనము మరియు తీర్థ ప్రసాదాలు అందచేశారు.
హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ గారు భక్తులను ఉద్దేశించి భాషనుగ్రహం చేశారు.
గౌ.దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి గారు,TSRTC చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు,MLC VG గౌడ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ దాదన్న గారి విట్ఠల్ రావు గారు,నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు, TSWDC చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత గారు,హస్త కలభి వృద్ధి సంస్థ చైర్మన్ సంపత్ కుమార్ గారు, మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ గారు,మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు గారు,ICDMS చైర్మన్ సాంబరి మోహన్ గారు దేవత మూర్తులని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.