వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు.
-త్వరలో నల్లగొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ.
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 80 సీట్లు గెలుస్తాం.
*కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా ఎంపీ పుట్టినరోజు వేడుకలు*
నల్లగొండ :(బ్రాహ్మణ వెల్లంల- నార్కట్పల్లి)
----------------------------------------------------------+------------+
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని,కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో పార్టీ శ్రేణుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లా తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గజమాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమని అన్నారు.వచ్చే మూడు నెలలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలని,అందరి సహకారంతో రాష్ట్రంలో 75 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.
కంటికి రెప్పలా కాపాడి ఐదు సార్లు గెలిపించారని వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని, కార్యకర్తల కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమని నా ప్రాణం కంటే కార్యకర్తల ప్రాణమే ముఖ్యమన్నారు. బ్రాహ్మణ వెల్లెంలకు కృష్ణ నీళ్లు రావడంతో సంతోషంగా ఉందని,పానగల్ ఎస్ఎల్బీసీ నుంచి సొరంగం ద్వారా నీళ్లు తెచ్చి, కృష్ణమ్మకు సారే చీరే కుంకుమ సమర్పించడం జరిగిందన్నారు.అప్పటి సీఎం వైఎస్ఆర్ ను ఒప్పించి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సాధించామని అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వైకుంఠధామాలు, ఫామ్ హౌస్ లు కట్టుకుంటే నాయకులు కాలేరని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, ఆపదలో ఉన్న ఏ కుటుంబానికైనా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రూ. 4000 నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్లగొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహిస్తామన్నారు.ఈ సభకు ప్రియాంక గాంధీని తీసుకురావడం జరుగుతుందన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలను చూసి మంత్రి పదవికే రాజీనామా చేశానని... తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలయిందో అర్థం కావడం లేదన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్ష పత్రాలను దిద్దలేని ప్రభుత్వం కాలేశ్వరంతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. బ్రాహ్మణ వెల్లెంలలో కృష్ణమ్మ నీళ్లను చూసి డాన్స్ చేశాను తప్ప తన బర్త్డే కోసం కాదన్నారు.రైతులు పండించిన ధాన్యం కల్లాల్లో ఎండకు ఎండి వానకు తడుస్తుంటే కొనలేని ప్రభుత్వం తెలంగాణలో ఉందని విమర్శించారు.
చత్తీస్గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు.బతికు ఉన్నంతకాలం ఎలా ఉన్నా మనది కాదని చనిపోయిన తర్వాత కూడా మనం ఏం చేశామో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారడని మరో జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటున్న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పవర్ ఫుల్ సీఎం వైఎస్ఆర్ నే బ్రాహ్మణ వెల్లెంలకు మూడుసార్లు తీసుకువచ్చానని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సీఎం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిస్డ్ కాల్ ఇస్తే హెలికాప్టర్లో వస్తారన్నారు.
రాష్ట్రంలో ప్రజలు రైతులు ముఖ్యమని మీరంతా బాగుండాలన్నారు. బ్రాహ్మణ వెల్లెంలలో మోటర్లు బిగించాలంటే అధికారులను ప్రస్తుత అధికార ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని రానున్న మూడు నెలల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు మాజిలై బస్టాండ్లలో బఠానిలు అమ్ముకుంటారని ఎద్దెవ చేశారు.
కార్యకర్తలు కెవిఆర్ సీఎం అంటూ నినాదాలు ఇస్తుంటే సీఎం అనవద్దని అంటే కానని ఎమ్మెల్యే కూడా గెలవనని, అందరూ కలిసి ఓడిస్తారని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలేసానని, పదవులు తనకు లెక్క కాదన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి,జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీర్ల ఐలయ్య, నకిరేకల్ నియోజకవర్గ నాయకులు
దైద రవీందర్, నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్ తో పాటు యువజన కాంగ్రెస్,ఎన్ఎస్ యుఐ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ ,బిసి సెల్ నాయకులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.