*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము రేణుకా మాత ఆశ్రమములో లోక కqళ్యాణార్థం శ్రీ శ్రీ చండీ సహిత రుద్ర యాగము కార్యక్రమంలో పాల్గొన్న: టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.*
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా, కైలాస పురం, కాచారం, గ్రామంలో జరిగిన *శ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము రేణుకా మాత ఆశ్రమములో లోక కళ్యాణార్థం శ్రీ శ్రీ చండీ సహిత రుద్ర యాగము మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, IVF తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు* దర్శనము చేసుకొని, చండీ సహిత రుద్ర యాగము పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
*అనంతరం ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..* ఈరోజు జరిగిన చండీ సహిత రుద్ర యాగములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని,దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు పాడి పంటలతో విలసిల్లాలని,ప్రజలందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు తెలిపారు.దేశంలో రైతుల, బీదల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారని,తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు దేశంలోనూ అమలు చేయాలని తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలని అన్నారు. భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న కేసీఆర్ గారి నాయకత్వం లో బీఆర్‌ఎస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే, వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం అని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* ఆహ్వానించిన వారు:IVF స్టేట్ ధార్మిక సమితి చైర్మన్ వంగపల్లి అంజయ్య ,ఫౌండర్, గంప శ్రీనివాస్, ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర కార్యదర్శి,గోల్డెన్ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ,BRS రాష్ట్ర సీనియర్ నాయకులు, తోట హరీశ్, శ్రీ అయిత రత్నాకర్ గారు,మాంకాల నవీన్ కుమార్ గారు,మీలా సోమయ్య గారు, రంగ శేఖర్ గారు,లెంకలపల్లి శ్రీనివాస్ గారు,IVF మహిళా విభాగం అడ్వైసర్ బీచ జయశ్రీ రవికుమార్ గారు, IVF స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొండా శైలేందర్ గుప్త, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు..