*--అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీస్* .
-జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS.
*--అయిదుగురు నిందితులు ఒక మహిళా నిందితురాలు అరెస్ట్* .
*--వీరి వద్ద నుండి 43 గంజాయి ప్యాకెట్ల (103 కిలోలు) గంజాయి, (సుమారు విలువ 10 లక్షల రూపాయలు)*
*--05 సెల్ ఫోన్‌లు స్వాధీనం* .
తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలన లో భాగ౦గా, తెలంగాణ రాష్ర్ట డి.జి.పి గారి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘా లో బాగంగా ఈ రోజు నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ అపూర్వా రావు గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మరియు కేతపల్లి పోలీసులు విశ్వసనీయ సమాచారంతో తేదీ 16.05.2023 తెల్లవారుజామున కేతపల్లి పిఎస్ పరిధిలోని ఎన్‌హెచ్ 65 లోని కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసు వారిని చూసి కొద్ది దూరం లో బస్సు ని ఆపి పారిపోవూటకు ప్రయత్నించగా అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని తనికి చేయగా వారిని వారి బ్యాగ్ లలో 43 గంజాయి ప్యాకెట్ల 103 కిలోలు (సుమారు విలువ 10 లక్షల రూపాయలు) గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒరిస్సా నుండి హైదరాబాద్ కి వెళ్తున్న ప్రయివేట్ బస్సులో మల్కాంగిరి నుండి గంజాయి ని హైదరాబాద్ కు తరలించున్నామని, వీరు మాల్కంగిరి ఒరిస్సా స్టేట్ కి చెందిన గంజాయి వ్యాపారం చేసే వినయ్ ద్వారా ఈ యొక్క గంజాయిని హైద్రాబాద్ లో వినయ్ కి తెలిసిన వ్యక్తి వివేక్ కు సరఫరా చేయుటకు వెళ్తున్నామని చెప్పగా,ఇందుకు గాను వీరికి ఒక్కొకరికి 10,000/- రూపాయల ఇస్తారు మరియు ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారు. అదే విదంగా జీవన్ సింగ్ కూడా మాల్కంగిరి లోనే గంజాయి ని కొని, ఇధే బస్సు లో గంజాయి ని హైదరాబాద్ కి అక్కడి నుండి మధ్య ప్రదేశ్ కు తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ప్యాకేట్లు చేసి అక్కడ తెలిసిన వారికి ఎక్కువ లాబానికి అమ్ముకుంటాడు అని చెప్పగా వీరి వద్ద నుండి 43 గంజాయి ప్యాకెట్ల 103 కిలోలు (సుమారు 10 లక్షల రూపాయలు విలువ) 05 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు పంపనైనది.
నిందితుల వివరాలు:
1) అశోక్ తారఫ్దర్ S/o ప్రవాష్ తారఫ్దర్, Age: 25 yrs Occ: సెంట్రింగ్ వర్క్ R/o MB 59, block: పొడియా, జిల్లా : మాల్కంగిరి, ఒడిస్సా స్టేట్ .
2) అబిజిత్ తారఫ్దర్ s/o రాంపడ తారఫ్దర్, age: 20 yrs, occ: విద్యార్ది, R/o MB 59, block: పొడియా, జిల్లా : మాల్కంగిరి, ఒడిస్సా స్టేట్
3) ఫణి తారఫ్దర్ S/o ప్రవాష్ తారఫ్దర్, Age: 27 yrs, Occ: సెంట్రింగ్ వర్క్ R/o MB 59, block: పొడియా, జిల్లా : మాల్కంగిరి, ఒడిస్సా స్టేట్ .
4) జీవన్ సింగ్ యాదవ్ s/o బాలు సింగ్ యాదవ్ , age: 32 yrs, occ: వ్యవసాయం r/o లక్ష్మీకేదా మండలం : అగర్ మాల్వా , జిల్లా : శాజాపుర్, మద్యప్రదేశ్ స్టేట్ .
5) ధనుజయ్ బిశ్వాస్ s/o పిజుష్ బిశ్వాస్ , age: 30 yrs, , occ: సెంట్రింగ్ , r/o MB 59,బాపన్పల్లి , కలిమెల మాల్కంగిరి, ఒడిస్సా స్టేట్.
6) శిఖా బిశ్వాస్ w/o ధనుజయ్ బిశ్వాస్, age: 29 yrs, r/o MB 59,బాపన్పల్లి , కలిమెల మాల్కంగిరి, ఒడిస్సా స్టేట్.
7) వినయ్ R/O జగ్దాల్పుర్, ఒర్రిస్సా (Absconding).
8) వివేక్ R/O హైదరాబాద్ (Absconding).
*నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వివరాలు*
వీరి వద్ద నుండి 43 గంజాయి ప్యాకెట్ల (103 కిలోలు) గంజాయి, (సుమారు విలువ 10 లక్షల రూపాయలు),05 సెల్ ఫోన్‌లు స్వాధీనం.
ఈ కేసు లో నల్గొండ డిఎస్‌పి నర్సింహ రెడ్డి గారి పర్యవేక్షణలో శాలిగౌరారం సిఐ రాఘవ రావు గారు, కేతేపల్లి ఎస్‌ఐ అనిల్ రెడ్డి, సిబ్బంది అంజాద్, నాగేశ్వర రావు, కిశోర్, సురేశ్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినంధించారు.