ఏసీబీకి చిక్కిన డిండి పంచాయతీ కార్యదర్శి

 లంచం సొమ్ముతో పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా డిండి గ్రామపంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

శంకరాచారి అనే వ్యక్తి తన ఇంటి రికార్డులు ఇవ్వాలని కోరగా పదివేల లంచం డిమాండ్ చేశాడు. దీనిపై శంకరాచారి ఏసీబీని ఆశ్రయించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో శ్రవణ్ కుమార్ పది వేల రూపాయలను శంకరాచారి నుండి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...