*తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో నల్లగొండ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)* .
*ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపి షికాగోయల్
ఐపిఎస్ గారి చేతుల మీదుగా AHTU టీంకు ప్రశంసా పత్రం* ..
నిన్న ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ వారి అద్వరయంలో నిర్వహించిన సమావేశంలో నల్లగొండ జిల్లా ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్ వారు విది నిర్వహణలో భాగంగా,బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్,మిస్సింగ్ & బెగ్గింగ్ కేసులు చేదించటంలో మరియు స్కూళ్లలో కాలేజీలలో కూడళ్లలో హాస్టల్లో స్టూడెంట్స్ కి బాల్యవివాహాలు, భ్రూణ హత్యలు, బాలల హక్కులు, మానవ అక్రమ రవాణా నిరోధించడం, తెలిసి తెలియని వయస్సులో ప్రేమ పేరుతో తల్లితండ్రులకు దూరం అవుతున్న యువతులు, సెల్ ఫోన్ ప్రభావంతో పక్కదారి పడుతున్న యువత, బాలకార్మిక వ్యవస్థ నిర్ములన, గృహ హింస, సైబర్ సెక్యూరిటీ,మహిళల పైన జరుగుతున్న నేరాలు,సోషల్ మీడియా డయల్ 100 వాటి గురించి విస్తృత అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోని మిగతా యూనిట్ల కంటే మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు గౌరవనీయులైన రాష్ట్ర మహిళా భద్రత విభాగం అడిషనల్ DGP. షికాగోయల్ IPS గారు అభినందించి, వారి చేతుల మీదగా A.H.T.U. SI. J. గోపాల్ రావు గారికి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా గౌరవనీయులైన నల్లగొండ ఎస్పీ అపూర్వ రావు గారు అడిషనల్ ఎస్పీ గారు A.H T.U. టీమ్ కి అభినందనలు తెలిపినారు.