అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు.. సిద్దమవుతున్న కమిషన్

 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు.. సిద్దమవుతున్న కమిషన్    .


ఢి ల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు

  • రాష్ట్ర‌ ఎన్నికల కమిషన్‌ అధికారులతో సమీక్ష
  • రిటర్నింగ్‌ అధికారుల జాబితా రూపొందించండి
  • ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలి
  • జూన్‌ నుంచి ఈవీఎంల తనిఖీ
  • అన్ని స్థాయిలలో పోల్ అధికారులకు శిక్షణ
  • పోల్ శాతాన్ని పెంచడానికి ఎస్‌వీ ఈఈపీ కార్యకలాపాలు

         : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సిద్దమవుతున్నది. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి వీలుగా ఇప్పటి నుంచే యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నది. ఈ మేరకు శనివారం ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) చెందిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలని, జాబితా పక్కగా ఉండేలా చూడాలని అధికారులను కేంద్ర ఎన్నకల సంఘం అధికారి నితీష్‌ వ్యాస్‌ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలను పకడ్భంధీగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్‌ అధికారుల (ఆర్‌ఓ) సమగ్ర జాబితాను సిద్ధం చేసి అప్‌డేట్ చేయాలని ఆయన సీఈఓ వికాప్‌ రాజ్‌ను ఆదేశించారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...