కేసీఆర్ కు తెలిసిందల్లా మోసం చేయడమే.. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 ప్రజ్ఞాపూర్:- పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. కేసీఆర్ కు తెలిసిందల్లా మోసం చేయడమే.. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. 


- మంచిర్యాల సత్యాగ్రహ సభకు వెళ్తున్నాం. తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలి. 

- రాహుల్ గాంధీ గారిపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారు. దీనికి నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. 

- అంబేద్కర్ జయంతి సందర్భంగా, దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నాం. 

- ఖర్గే గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ప్రజల్లో చైతన్యం వస్తోంది. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు.. 

- రాష్ట్రంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. వడగళ్ల వానొచ్చి గజ్వేల్ తోపాటు తుర్కపల్లి, ఆలేరు సహా చాలా చోట్ల రైతులు నష్టపోయారు. కానీ, ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. 

- ఎంతసేపు.. ఏపీలో ఎలా బలపడదామా? మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారు 

- ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి.. 3 నెలల్లో నోటిఫికేషన్ రాబోతోంది.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కడతారు. 

- ముఖ్యంగా నిరుద్యోగులు మావైపే ఉన్నారు. వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. ఒకటా రెండా.. కేసీఆర్ మోసాలు ఎన్నో.. 

- టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు.. గతంలో ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దే విషయంలో అక్రమాలు జరిగాయి. 90 మార్కులు వస్తాయని అనుకున్న విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి.. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

- టెన్త్ పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. ఉన్న ఖాళీలు భర్తీ చేయరు.. ఇన్నాళ్లూ ఏం చేశారు కేసీఆర్. 

- జాతీయ రాజకీయాలు అంటున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే పేపర్ లీకేజ్ లు చేస్తారా? ఉద్యోగ కుటుంబాలను విడదీస్తారా? పేపర్లు దిద్దడంలో అవకతవకలు చేస్తారా? 

- ఇవన్నీ మారాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూస్తున్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...