మానవత్వం చాటుకున్న తోటి సిబ్బంది*

-మానవత్వం చాటుకున్న తోటి సిబ్బంది* 


 *--- కిడ్నీల సమస్యతో బాధపడుతున్న కానిస్టేబుల్ గోలి నవీన్ గారికి ఆర్థిక సాయం* 


     జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వడ్ విభాగంలో 2018 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్     గోలి నవీన్ గత కొంత కాలంగా  కిడ్నీల సమస్యతో బాధపడుతూ  సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నందు డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇతనికి కిడ్నీ చికిత్స కొరకు సుమారు 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపగా, నవీన్ తో పాటు అర్ముడ్ రిజర్వడ్ విభాగంలో పనిచేస్తున్న తనతోటి సిబ్బంది అందరూ కలిసి మానవత్వంతో కానిస్టేబుల్ నవీన్ కి  65 వేల రూపాయలు తన తల్లితండ్రులకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

         ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ నరసింహ చారి,వెల్ఫేర్ ఆర్.ఐ స్పర్జన్ రాజ్,ఆర్.యస్.ఐ లు కళ్యాణ్ రాజ్,మమత,శ్రావణి,ఏ.ఆర్.యస్.ఐ చిన్న బాబు, హెడ్ కానిస్టేబుల్ హఫీజ్,యాదగిరి, కానిస్టేబుల్స్ కిషన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...