Cctvs నియంత్రణ లో బాగాంగ CCTVs పాత్ర కీలకం* ..
*CCTVs ఏర్పాటు కోసం మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ యాజమాన్యం 5 లక్షల రూపాయల చెక్కు విరాళం* ...
*నేర రహిత జిల్లాగా రుపొందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ ల కృషి* ..
*దాతలు ప్రజా శేయస్సు,ప్రజా రక్షణ కొరకు సి.సి.టి.వి ల ఏర్పాటుకు ముందుకు రావాలి* ..
*జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు ఐ.పి.యస్*
ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో మిర్యాలగూడ డి.యస్.పి వెంకటగిరి గారి అధ్వర్యంలో రైస్ మిల్ అసోసియేషన్ యాజమాన్యం వారు మిర్యాలగూడ పట్టణ సేఫ్టీ మరియు సెక్యూరిటీ లో బాగంగా సి.సి కెమెరాల ఏర్పాటుకు 5 లక్షల రూపాయలు చెక్కును విరాళంగా జిల్లా ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యస్.పి గారు అభినందనలు తెలుపుతూ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నేర రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని ఏదైనా నేరం జరిగినప్పుడు సి.సి కెమెరాల పాత్ర కీలకం కానుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో,పట్టణంలో,రహదారి కూడలిలో,కాలనీలలో సి.సి
టి.వి లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నల్లగొండ జిల్లాను ప్రజా రక్షణ, ప్రజా సేయస్సు కోసం పారిశ్రామిక వేత్తలు, ప్రజా ప్రతినిదులు,వ్యాపార సముదాయాలు సంఘాల వారు,అనేక మంది వ్యాపార వేత్తలు,దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి,వన్ టౌన్ సిఐ రాఘవేందర్,రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,సభ్యులు కుషలయ్య,రమేష్,లింగయ్య, బాబీ మరియు శ్రీనివాసులు పాల్గొన్నారు.