సూర్యాపేట మున్సిపాలిటీలో నకిలీ రసీదుల కుంభకోణం

 *మున్సిపాలిటీ లో నకిలీ రశీదుల పట్టివేత*


*ట్రేడ్ లైసెన్స్ లు నకిలీ రశిదులు ప్రింట్ చేసి డబ్బులు వసూలు చేసిన జవాను హన్మంతు నాయక్*


*జవాను హన్మంతు నాయక్ పై కేసు నమోదు, ఉద్యోగం నుండి తొలగించిన మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి*


*జవానుతో పాటు పిఎస్ ఆర్ సెంటర్ లోని మీ సేవ యజమాని పాత్రపై విచారణ జరుపుతున్న పట్టణ పోలీసులు* 


సూర్యాపేట పట్టణంలో వ్యాపారులకు నకిలీ రశీదులు ఇఛ్చి, మున్సిపాలిటీ కమీషనర్ ల  ఫోర్జరీ సంతకాలు చేసి  డబ్బులు వసూలు చేసిన సంఘటనలో సూత్రదారి మున్సిపాలిటీ జవాను హన్మంతు నాయక్ ను విధుల నుంచి తొలగించి స్ధానిక పోలీసు స్టేషను నందు కేసు నమోదు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి తెలిపారు. ఆదివారం నాడు మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని వ్యాపారులను అడిగినప్పుడు వారు రశీదులు చూపించారని, కాని రశీదులు మున్సిపాలిటీ ఇచ్చినవి కావని గ్రహించి, నకిలీ రశీదులు ఇచ్చిన జవాను హన్మంతు నాయక్ ను పిలిచి విచారణ చేయగా, వ్యాపారస్తులకు నకిలీ రశీదులు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని,  గతంలో పనిచేసిన కమీషనర్ ల సంతకాలు కూడ ఫోర్జరీ చేసి పెట్టారని అన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాంప్ లు కూడ రశీదుల మీద వున్నాయని కమీషనర్ తెలిపారు. జవానుతో  పాటు మీ సేవ యజమాని రాజు నాయక్ పైన కూడ పోలీసుల విచారణ జరుగుతుందని అన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...