వివాహితను లైంగికంగా వేదించి కేసుపెడితే చంపుతానని బెదిరించి కత్తి పట్టుకొని తిరిగిన వ్యక్తి అరెస్టు*


 *వివాహితను లైంగికంగా వేదించి కేసుపెడితే చంపుతానని బెదిరించి కత్తి పట్టుకొని తిరిగిన వ్యక్తి అరెస్టు* 



 *మహిళల పైన లైంగిక వేదింపులు గురి చేస్తే  కఠిన చర్యలు* 

 *జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐ.పి.యస్* 


నేరస్తుని వివరములు:-

01. జక్కా రాంబాబు s/o నర్సింహారావు, వయస్సు: 35 సంవత్సరాలు, కులం: యాదవ్, Occ: వ్యవసాయం, r/o కిస్టాపురం గ్రామం, మిర్యాలగూడ మండలం  


కేసు వివరములు:-


మిర్యాలగూడ మండలం కిస్టాపురం గ్రామంకు చెందిన ఒక మహిళను తేదీ 07.03.2023 నాడు రాత్రి తన గ్రామంలో తన ఇంటికి వెల్లుచుండగా అదే గ్రామానికి చెందిన జక్కా రాంబాబు అను వ్యక్తి లైంగిక వేదింపులు చేయుచుండగా, అట్టి వ్యక్తిని మహిళలకి సంబందిచిన వారు చూసి పట్టుకోబోగా పారిపోయినాడు.  వారందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెల్లుచుండగా, అట్టి వ్యక్తి పై వారు కేసు పెడతారని బావించి తన ఇంటిలోని ఇనుప కత్తి తీసుకొని వచ్చి వారందరినీ బయబ్రతులకు గురిచేసినాడు. బాడితురాలు తేదీ 08.03.2023 రోజున ఉదయం ఇచ్చిన ధరఖస్తు పై పలు సెక్షన్ల ప్రకారం మరియు ఆర్మ్స్ ఆక్ట్ కేసు నమోదు చేసి మిర్యాలగూడ రూరల్  పోలీసులు దర్యాప్తు చేసి తగు సాక్షాదారాలు సేకరించి, అట్టి వ్యక్తిని రేమండ్ కు తరలించనైనది.        


      ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేదింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.జిల్లా లో షి టీమ్ బృందాలు అన్ని ప్రాంతాలలో నిఘా పెడుతూ ఉన్నాయని ఎవరినైనా వేదింపులకు గురి చేస్తే దైర్యంగా డైల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కి తెలియపరచగలరు మి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

*నేరస్తుల నుండి స్వాదీన పరచుకున్న వస్తువులు* :-

నేరస్తుడి నుండి ఒక పొడవైన ఇనుప కత్తి.

   ఇట్టి కేసును మిర్యాలగూడ డి.యస్.పి గారి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకముగా తీసుకున్న  ఎం.సత్యనారాయణ, సి.ఐ. ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ రూరల్ గారి నేతృత్వంలో మిర్యాలగూడ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహులు బృందంతో, అట్టి నేరస్తుడిని అతి తక్కువ సమయంలో పట్టుకొని కేసు చేదించినందుకు జిల్లా యస్.పి గారు అభినందనలు తెలియజేసినరు. .

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...