అడవులను సంరక్షించుకోవాలి
.............................
అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి
అన్నారు. ప్రపంచ అడవి దినోత్సవం, నేటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ రసాయనిక పదార్థాలతో తయారు చేసిన కూరగాయలను వాడకుండా సేంద్రీయ ఎరువులతో తయారు చేసిన కూరగాయలు వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యము బాగుంటుందని పేర్కొన్నారు. నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను తీసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని తెలిపారు. నీటి సంరక్షణ పై మున్సిపల్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా సేంద్రీయ ఎరువులతో కూరగాయలు పండించిన రైతు నుండి కూరగాయలను కొనుగోలు చేసి మున్సిపల్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు సురేష్ గుప్తా, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.