నకిలీ బంగారాన్ని నిజమైన బంగారం అని నమ్మిచి మోసం చేసే అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్టు*


 *నకిలీ బంగారాన్ని  నిజమైన బంగారం అని నమ్మిచి మోసం చేసే  అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్టు*


..

*వీరి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదు* 

*ఐదు ఒరిజినల్ బంగారు బంతులు, నాలుగు సెల్ ఫోన్‌లు, 3 కేజీల బరువున్న నకిలీ బంగారు గొలుసులు (హరం) స్వాదీనం* .


తేదీ 17-03-2023 నాడు అంగడి పేటకు చెందిన యమ్.దర్మరాజు మరియు 20-03-2023 రోజున పూరీ శేషయ్య కొండ మల్లపల్లి కి చెందిన వ్యక్తులు  కొండమల్లపల్లి పీఎస్‌ లో నకిలీ బంగారు హారంని నిజమైన బంగారు హారం అని నమ్మిచి మోసం చేసినా విషయం పైన ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టగా నిందితులు రాజస్థాన్ రాష్ట్రం కి చెందిన వ్యక్తులు అయిన..  


 *నిందితుల వివరాలు* 

A1.  పంచారామ్ @ పంచ్ s/o సోనా @ సోనాజీ, వయస్సు 57 సంవత్సరాలు, కులం వాగ్రి (SC), Occp: ప్లాస్టిక్ ఫ్లవర్ వ్యాపారం మరియు కూలీ, R/o H.NO 252, వగ్రియోంక వాస్, బగల్భీం గ్రామం బిన్మల్ తహసిల్, జలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.  

  A2.  గులాబ్ రామ్  s/o బగారం, వయస్సు 43 సంవత్సరాలు, కులం వాగ్రి (SC), Occp: ప్లాస్టిక్ ఫ్లవర్ వ్యాపారం మరియు కూలీ, R/o H.NO 288, వగ్రియోంక వాస్, నారద్రా గ్రామం  షిర్‌గంజ్ తహసిల్, సిరోహి జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. 

  A3.  ఉమారం s/o తేజారామ్ @ తేజాజీ, వయస్సు 40 సంవత్సరాలు, కులం వాగ్రి (SC), Occp: ప్లాస్టిక్ ఫ్లవర్ వ్యాపారం మరియు కూలీ, R/o  బిన్మల్ తహసిల్ యొక్క తవాబ్ గ్రామం, జలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.

 *కేసు వివరాలు* :-

  వీరు రాజాస్థాన్ లో ప్లాస్టిక్ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు  డబ్బులు సరిపోక నిందితులు అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసం చేయాలనే ఉద్దేశంతో . తేది. 02-03-2023న నిందితులు A1. పంచరం @ పంచ్ s/o సోనా @ సోనాజీ మరియు A3. ఉమారం s/o తేజారామ్ @ తేజాజీ అంగడిపేట గ్రామంలోని ఎం. ధర్మరాజు కిరణం దుకాణాన్ని సందర్శించి వెండి నాణెం, బిళ్ళలను చూపించి కొనమని అడుగగా, కిరణం దుకాణ యజమాని వెండి నాణెం తీసుకోవడానికి నిరాకరించాడు. మళ్లీ 05-03-2023న నిందితులు అదే కిరణం దుకాణానికి వెళ్లి షాపు యజమాని ఎం. ధర్మరాజు , అతని భార్య అభినయకు గుంటూరు లో కూలి పనికి వెళ్లి బేస్‌మెట్‌ను తవ్వగా మాకు బంగారు హారం దొరికింది అని సుమారు కిలోన్నర బంగారు ఆభరణాన్ని (హరాం) చూపించారు.ముందుగా  రెండు ఒరిజినల్ బంగారు బంతులను బంగారు హరాం నుండి తిసి  ధర్మరాజు కి ఇవ్వగా, అతను తనకు తెలిసన కమ్మరి వద్ద బంగారు బంతులను చెక్ చేయగా అవి నిజమైన బంగారం అని చెప్పినాడు. తేది. 08-03-2023 న షాపు యజమాని ధర్మరాజు మొబైల్ నంబర్ కి  నిందితులు ఫోన్ చేసి రూ. 3,00,000/-తో దేవరకొండకు రమ్మని తెలియజేసాడు, దానిపై ఎం. ధర్మరాజు సాయంత్రం సమయంలో తన భార్యతో కలిసి దేవరకొండకు వెళ్లగా  అక్కడ నిందితులు నకిలీ బంగారం అప్పగించి, నిందితులు  రూ. 3 లక్షల రూపాయలు  తీసుకొని  గుంటూరు జిల్లా బిసినేపల్లి గ్రామానికి వెళ్ళిపోతారు.

   తరువాత మళ్ళీ  రెండవ వ్యక్తి అయిన పూరీ శేషయ్య  కొండ మల్లపల్లి లో  బ్రాండ్ ఫ్యాక్టరీ గార్మెంట్‌ దుకాణాము వద్దకు తేది.20-03-2023న సుమారు 15.00 గంటల సమయంలో A-2, A1 మరియు A-3 లతో కలిసి బంగారు గొలుసుతో శేషయ్య దుకాణానికి వెళ్లి మొదటి వ్యక్తికి చెప్పిన విదంగా చెప్పి  సుమారు ఒకటిన్నర కేజీల  బరువున్న నకిలీ బంగారు ఆభరణం (గొలుసు) ఇచ్చి  రూ. 3,00,000 / -డబ్బులు అడిగాడు, శేషయ్య బంగారు గొలుసు తీసుకొని అది నకిలీదని తెలుసుకొని, వారి వివరాలు అడుగి, డబ్బు తీసుకువస్తానని చెప్పి వారిని దుకాణం లోనే కూర్చోబెట్టి కొండమల్లేపల్లి పోలీసులకు సమాచారం అందించగా పోలీస్ వారు వెళ్లి పట్టుకుని కేసు నమోదు చేసుకొని నిందితులను  నేడు రిమాండ్ కి పంపనైంది .

  

ఈ కేసుని చకచక్యంగా డియస్పీ దేవరకొండ నాగేశ్వర రావు గారి అద్వరయంలో ఛేదించిన సి.ఐ ఎస్.శ్రీనివాసులు ఎస్‌ఐ  పి.వీరబాబు కొండమల్లేపల్లి ఎస్‌.ఐ  కె.సతీష్‌  దేవరకొండ మరియు సిబ్బందిని జిల్లా యస్.పి గారు అభిందించినారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...