శ్రీ సీతా రాముల కళ్యాణ

 💐జై శ్రీమన్నారాయణ 💐

రామగిరి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ఈ రోజు శ్రీరామ నవమి ని పురస్కరించుకుని శ్రీ సీతా రాముల కళ్యాణ


మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింప బడింది.

దాదాపు పదివేల మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించి తరించారు.

స్థానిక శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు మున్సిపల్ చైర్మన్ శ్రీ మందడి సైదిరెడ్డి గారు వైస్ చైర్మన్ శ్రీ అబ్బగోని రమేష్ గారు , జిల్లా కలెక్టర్ శ్రీ వినయ కృష్ణా రెడ్డి దంపతులు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి అపూర్వ రావు గారు

మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీమతి యామా కవిత దయాకర్ గారు, వట్టిపల్లి శ్రీనివాస్ గారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు, ఓరుగంటి రాములు గారు

ఆలయ చైర్మన్ చకిలం వేణు గోపాల్ రావు గారు, మెంబర్లు శ్రీమతి యాట జయప్రద, శ్రీమతి పాదం ప్రియాంక

శ్రీ కక్కిరేణి లక్ష్మీనారాయణ, శ్రీ వేదాంతం శ్రీనివాసా చార్యులు

ఆలయ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి చకిలం సంధ్యా రాణి

భువనగిరి దేవేందర్ కాంచనపల్లి రవీందర్ రావు, రమేష్ బాబు , భువనగిరి ప్రభాకర్, మామిడి పద్మ, మొదలగు పుర ప్రముఖులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని తరించారు.

శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు,పుస్తె మెట్టెలు తలంబ్రాలు సమర్పించారు

భద్రాచలం రాములవారి సన్నిధి నుండి విచ్చేసిన ముత్యాల తలంబ్రాలు శేష మాలలు  ఈ కల్యాణ మహోత్సవంలో సమర్పించడం జరిగింది

కళ్యాణం పూర్తి కాగానే దాదాపు 8 వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది

ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భక్తులు హాజరయ్యారు.

భక్తులకు కావలసిన ఏర్పాట్లు ఆలయ కమిటీ విస్తృతంగా చేసింది. భక్తులు ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవషులయ్యారు

వికాస తరంగిణి మరియు సత్య సాయి సేవా సంస్థలు వారి సేవలు భక్తులకు అందించాయి భక్తులందరికి పానకం వడ పప్పు అందించారు .

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...