నల్గొండ బార్ అసోసియేన్ నూతన అధ్యక్షుడిగా నేతి రఘుపతి ఒక్క ఓటు తేడాతో సంచలన విజయం సాధించారు. పోటాపోటీగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీ.కిరణ్ కుమార్ పై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందడం విశేషం.ద్యంతం ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఆధిక్యతలు క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠతగా కొనసాగగా, చివరకు విజయం రఘుపతిని వరించింది. ప్రధాన కార్యదర్శిగా జెనిగల రవికుమార్ తన సమీప ప్రత్యర్థి నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై గెలుపొందారు. మొదటి ఉపాధ్యక్షుడిగా అయితగోని లాలయ్య, రెండవ ఉపాధ్యక్షుడిగా మోర ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా దాసరి యాదగిరి, సహాయ కార్యదర్శిగా పెరుమాళ్ల శేఖర్, క్రీడల కార్యదర్శిగా ఏర్పుల కామేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా సిహెచ్. నాగరాజు, గాలి శ్రీనివాస్, పులిజాల కార్తీక్, కీసరి శ్రీనివాస్ రెడ్డి, జి. కిషోర్ కుమార్, మద్దికుంట్ల నాగిరెడ్డి, కొండ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారులుగా కట్ట అనంతరెడ్డి, సయ్యద్ జమీన్, సిహెచ్. గోపాల్ వ్యవహరించారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో అభినందనలతో ముంచేత్తి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.