*నేర సమీక్షా సమావేశం*
*జిల్లా యస్.పి శ్రీమతి కె.అపూర్వ రావు
ఐ.పి.యస్*
*డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లతో నేర సమీక్షా సమావేశం.*
*సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశం.*
*రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు*
*అసాంఘిక కార్యకలాపాలైన గంజా,జూదం,పి.డి.యస్ రైస్ లాంటి వాటిపై ప్రత్యేక నిఘా..* .
తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు అయ్యేలా చూడాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటుని పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు ఐ.పి.యస్ గారు ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి ఏర్పాటుకు కృషి చేయాలని. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి,పేకాట,పి.డి
యస్ బియ్యం,బహిరంగ ప్రదేశాలలో మధ్యం సేవించడం లాంటి వాటిపై నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు, యస్.బి డి.యస్.పి వై.మొగిలయ్యా, డి.సి.ఆర్బి డి. యస్పి బి.రమేష్, నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి, దేవరకొండ డి.యస్.పి నాగేశ్వరా రావు , సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.
పోలీస్ పి.ఆర్.ఓ
జిల్లా కార్యాలయం నల్లగొండ