మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు* *జిల్లా యస్.పి కె.అపూర్వ రావు


*మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు* 

 *జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐ.పి.యస్* 


 *ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు* 


జిల్లా పోలీస్ కార్యాలయం యస్.పి గారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ పిబ్రవరి నెలలో  జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు  నడుపుతూ  1188 మంది  పట్టుబడగా వీరిలో 453  మందిని కోర్టు లో హాజరుపరచగా 21 మందికి ఒక  రోజు, 08 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు  రోజుల జైలు శిక్ష మరియు  జరిమానా వేస్తూ  తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన  వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. పిబ్రవరిలో మొత్తం 1188 డి.డి కేసులు నమోదు కాగా  178830/- రూపాయల జరిమాన విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు.  వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...