పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణ చారి



 పనులను త్వరగా పూర్తి చేయాలి


.....,....................................... 




 పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణ చారి సంబంధిత కాంట్రాక్టర్ లు,   అధికారులకు సూచించారు.  పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను కమిషనర్, సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్ నిర్మాణ పనులను  త్వరగా పూర్తిచేయాలని, అదేవిధంగా కల్వర్ట్, లింకు రోడ్లను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలన్నారు. అనంతరం గొల్లగూడ సమీపంలోని పెద్ద బండ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో అడ్డుగా వస్తున్న పైప్ లైన్లకు ఇబ్బంది రాకుండా  చూడాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  ఈ ఈ  రాములు, డి ఇ లు అశోక్, వెంకన్న, ఏసీపీ నాగిరెడ్డి, టి పి ఎస్ శివ, జె పి ఓ ఖాదర్, ఎస్సై శంకర్ ఇతరులు పాల్గొన్నారు.


 విధిగా రిజిస్టర్ లో నమోదు చేయాలి....


 మున్సిపల్ కమిషనర్ కె.వి రమణ చారి బుధవారం మిర్యాలగూడ రోడ్డులోని డైట్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన డబల్ బెడ్ రూమ్ దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్నా మున్సిపల్ సిబ్బంది తో మాట్లాడి  వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుడు  వచ్చిన వెంటనే దరఖాస్తు ని పరిశీలించి   దరఖాస్తుదారుని పేరుని  రిజిస్టర్లో నమోదు చేసి అనంతరం దరఖాస్తుదారునికి రసీదు అందివ్వాలని ఆదేశించారు. దరఖాస్తు దారుడు  అందించిన దరఖాస్తు, రిజిస్టర్ లో నమోదు చేసిన నెంబరు, దరఖాస్తుదారునికి ఇచ్చే రసీదులో నెంబరు ఒకటే ఉండే విధంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...