పోలీస్ కానిస్టేబుల్/ యస్.ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు గ్రౌండ్ ఏర్పాట్లను పరిశీలించిన* ..
*జిల్లా యస్.పి అపూర్వ రావు
ఐ.పి.యస్*
తెలంగాణ రాష్ట్ర నియామక మండలి బోర్డ్ ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్/యస్.ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన 4790 అభ్యర్థులకు ఈ నెల 15 వ తేది నుండి దేహదారుఢ్య పరీక్ష నిర్వహించుటకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియం ను జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వ రావు ఐ.పి.యస్ గారు సందర్శించి అభ్యర్థులకు కావలసిన వసతుల పైన పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షలను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నమనీ, ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షను రేడియో వేవ్, సెన్సార్ పద్ధతుల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా గ్రౌండ్ మొత్తం సి. సి కెమెరాల పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అభ్యర్థులు ఆత్మస్థైర్యంతో విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఉద్యోగాలు ఇప్పస్తామంటూ మాయ మాటలు చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని అన్నారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే మైదానంలో సాంకేతిక, ఇతర సౌకర్యాలకు గురించి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నరసింహ రెడ్డి,ట్రాఫిక్ సిఐ శ్రీను, ఆర్. ఐ లు హరిబాబు, శ్రీను,సంతోష్ ,యస్. ఐ రాజశేఖర్ రెడ్డి,టెక్నికల్ టీం సభ్యులు, పాల్గొన్నారు.