అభ్యర్దులు మాయ మాటలు నమ్మి మోసపోవద్దు*జిల్లా యస్.పి అపూర్వ రావు


 *పోలీస్ కానిస్టేబుల్/ ఎస్.ఐ ల శారీర ధారుఢ్య పరీక్షల నిర్వాహిణకు ఏర్పాట్లు పూర్తి** 

 *అభ్యర్దులు మాయ మాటలు నమ్మి మోసపోవద్దు* 

 *ఈ నెల 15 వ తేదీ నుండి 20 వరకు మేకల అభినవ్ స్టేడియం నందు 4790 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు* ..

 *జిల్లా యస్.పి అపూర్వ రావు


ఐ.పి.యస్.* 


*తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆదేశాల మేరకు ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్/ యస్. ఐ అభ్యర్థులకు ఈ నెల 15 తేదీ నుండి 20 వ తేది వరకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా  యస్.పి గారు ఒక ప్రకటనలో తెలియ జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 4790 మంది అభ్యర్ధులు అర్హత పొందినట్లు వీరిలో మహిళా అభ్యర్దులు 1388 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అభ్యర్దులకి ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా దేహ దారుఢ్య పరీక్షలు జరిగే గ్రౌండ్ మొత్తం సి.సి కెమెరాల నిఘా పెట్టమని, పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుందని " ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు ఉద్యోగం వచ్చేవిధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని  తెలిపారు. ప్రతీ అంశం హై టెక్నాలజీతో   ముడిపడి ఉంటుందని, ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తున్నామని, ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా అభ్యర్దులకి ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా R.F.I.D ( radio frequency identification reader) ద్వారా నిర్వహిస్తున్నాం. ప్రతీబ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతీ అంశం సి.సి కెమెరాల్లో రికార్డు అవుతుందని, దాన్ని భద్రపరుస్తామని, భవిష్యత్తులో ఏవైనా విమర్శ లు వస్తే సి.సి పుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని, వేలిముద్రలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల్ని గ్రౌండ్లోకి అనుమతిస్తారని అన్నారు.

 *పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ శారీక దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలి.* 


 🔹 రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం ( admit card / intimation letter ) తమ వెంట తీసుకురావాలి.


 🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన పార్టు 2 అప్లికేషన్ ఫామ్


 🔹 తమ స్వీయా సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం నకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడి ఉండాలి.


 🔹 అభ్యర్థి సీయా సంతకము కలిగిన మాజీ సైనిక దృవ పత్రం ( PPT / డిచార్జీ బుక్ ) /నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ( ఇంకా సర్వీసు నుండి డిచార్జీ కానివారికి)


 🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన ఏజన్సీ ఏరియా సర్టిఫికేటు ఫర్ ఆదివాసి, షెడ్యూల్డు తెగ G.O. MS 24, ట్రైబల్ వెల్ఫేర్ ( LTR 1 )

డిపార్టుమెంటు తేది: 12-06-2018 ప్రకారంగా జారీచేయబడింది.


 🔹 అభ్యర్థులు వారికి ఉద్దేశించిన తేదీలలో మాత్రమే శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హాజరు కాగలరు.


 🔹 అభ్యర్థులు పరీక్ష నిర్వాహాణ కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే బయటకు అనుమతిస్తారు. కావున అభ్యర్థులు అందుకు తగిన విధంగా సంసిద్ధులై రాగలరు.


 🔹 అభ్యర్ధులు తమ వెంట దుస్తులు ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు.


🔹 అభ్యర్థులు ప్రతీ ఈవెంట్ వద్ద మరియు పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో " క్యూ " పద్ధతిని

పాటించాలి 


🔹 సెల్ఫోన్లు మరియు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించడబవు.


 🔹 మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలం మరియు గాజులు ధరించి పరీక్షకు హాజరుకారాదు.


 🔹 బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర

రంగులు వేసుకుని రాకూడదు.


 🔹 పరీక్ష నిర్వాహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించవలెను.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...