వివిధ కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ చట్టాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*
**ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్ చేయడం నేరం* .
నేడు జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు యాంటీ ర్యాగింగ్ పైన కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 నుండి అమల్లోకి ఉంది అని , ర్యాగింగ్ చట్టప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ర్యాగింగ్ అనగా వ్యక్తులను, వ్యక్తిని అవమానపరచుట, భయపెట్టి, భయం కలిగేటట్లు చేయుట వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన. కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు. ర్యాగింగ్ ఒక విష సంస్కృతి దానికి అందరూ దూరంగా ఉండాలని తెలిసీ తెలియని వయసులో సిగరెట్, గుట్కా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని తెలిపారు. పోలీసులు అమలు పరుస్తున్న చట్టం (ఐపీసీ) ఇండియన్ పీనల్ కోడ్ 1861 అమల్లోకి వచ్చిందని అందులో ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సేవలు అందిస్తుందని ప్రతి ఒక్కరూ నిర్భయంగా పోలీసులకు ఫోన్ చేయవచ్చు, పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వవచ్చు, లేదా డయల్ 100, ద్వారా సమాచారం అందించిన తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.