నల్లగొండ నియోజకవర్గానికి చెందిన 266 మంది బాధిత లబ్ధిదారులకు... 95,88,400/- రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి



గారు వీటి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో... వివిధ ప్రవేట్ ఆసుపత్రిలలో చికిత్స పొందిన నల్లగొండ నియోజకవర్గానికి చెందిన  266 మంది బాధిత లబ్ధిదారులకు... 95,88,400/- రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు..

 ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం పాలై... ప్రైవేట్ ఆస్పత్రిల లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాల వారికి... ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని... తప్పనిసరి అయితే తప్ప ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకూడదని.. ఇప్పుడు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి అన్ని  వసతులతో కూడి కార్పొరేట్ ఆసుపత్రిలో స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నారని పేదవారు ఆసుపత్రిలో చికిత్స పొంది తక్కువ ఖర్చుతో.. వైద్యం చేయించుకోవచ్చని  తెలిపారు.. తాను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు 6290 దరఖాస్తులు పంపగా 5573... మంది బాధిత లబ్ధిదారులకు ఎల్ఓసి ల రూపంలోనూ చెక్కుల రూపంలోనూ.. నేటి వరకు 25,93,81 350/- రూపాయలు అందజేశామని, ఇంకా 920 దరఖాస్తులు పరిశీలనలో  ఉన్నాయని  తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మంత్రి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్..గీతా కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికమ్ సత్తయ్య గౌడ్, కనగల్ తిప్పర్తి ఎంపీపీలు ఎస్కే కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, సీనియర్ నాయకులు కంచనపల్లి రవీందర్  రావు...సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, అలకుంట నాగరత్నం రాజు, ధోటి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య దేప వెంకటరెడ్డి, పట్టణ పార్టీ కార్యదర్శి భువనగిరి దేవేందర్ అధికార ప్రతినిధి సందినేని జనార్దన్ రావు, నాయకులు, రావుల శ్రీనివాసరెడ్డి  పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కడారి కృష్ణయ్య కృష్ణార్జున్ రెడ్డి,మండల పార్టీ కార్యదర్శులు.. K నరేందర్ రెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...