కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,చెక్కులను అందజేసిన. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి


గారు తమ క్యాంపు కార్యాలయంలో... 356 మంది లబ్ధిదారులకు,,3,56,41,296/-

 రూపాయిల విలువ చేసే కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,చెక్కులను అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్ల ఇంటికి భారంగా భావించకూడదని, కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు తీసుకుపోయేది మహిళ అని.. కంచర్ల అన్నారు.. ఇంకా సమాజంలో మహిళల పట్ల అసమానతలు ఉన్నాయని పురుటిలోనే వడ్ల గింజలతో ఆడపిల్లల్ని చంపుకునే సంస్కృతి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఉండటం శోచనీయమని... అందుకే మహిళా సాధికారత సాధించడం కోసం కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని... వారికి కాన్పు అయ్యే వరకు  పౌష్టికాహారం అందించడం ఉచితంగా ప్రభుత్వ వైద్యశాల లో డెలివరీ చేయించి 13వేలు రూపాయలు నగదు తో పాటు కేసిఆర్ కిట్ అందించి గౌరవంగా వారిని ఇంటికి పంపుతుందని...  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆడపిల్ల పెళ్ళికి 1,00,116 రూపాయలు... కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేర్ల మీద అందిస్తున్న ఏకైక నాయకుడు కెసిఆర్ అని, వారిని మేనమామల ఆదరించి  ఆర్థిక సహాయం అందిస్తున్నారని, అదేవిధంగా వృద్ధులకు పెద్దకొడుగ్గా, రైతులకు బాంధవుడుగా, సమాజం ల్లోని సంబండ వర్గాల వారికి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని...

 అలాంటి నాయకుని పట్ల విశ్వాసంతో,నమ్మకంతో,ఉండాలని కెసిఆర్ నాయకత్వాన్ని మహిళాలోకం మరింతగా బలపరచాలని ఈ సందర్భంగా కంచర్ల వారిని కోరారు...

ఈ కార్యక్రమంలో...

ఆర్డీవో జయ చంద్రారెడ్డి, తిప్పర్తి,  కనగల్,నల్గొండ ఎమ్మార్వోలు...

 నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్గొండ ఎంపీపీ, సుమన్.. కనగల్ జడ్పిటిసి చిట్ల వెంకటేశం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్  సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్...

 నల్గొండ తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు... దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాదయ్య,... నాయకులు..

 పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, భువనగిరి దేవేందర్, సందినేని జనార్దన్ రావు,.. తవిటి కృష్ణ కందుల లక్ష్మయ్య, పొనుగోటి జనార్దన్ రావు.. పలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు  తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...