*అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులు అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీస్* .




*అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులు అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీస్* .
జిల్లా యస్.పి రేమా రాజేశ్వరి ఐ పి యస్ 
 *నలుగురు నిందితులు అరెస్ట్* ..
 *వీరి వద్ద నుండి  862.350 కె.జి ల గంజాయి స్వాదీనం మొత్తం  విలువ అందాజ 1,29,30,000/- రూపాయలు* 
 *ఒక డి.సి.యం,ఒక కారు,నాలుగు సెల్ ఫోన్లు స్వాదీనం* .

తెలంగాణ రాష్ర్ట డి.జి.పి గారి ఆదేశాల మేరకు , మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతర నిఘా లో బాగంగా  ఈ రోజు నల్గొండ జిల్లా  ఎస్పీ శ్రీ  రెమా రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు  చిట్యాల పోలీసులు  విశ్వసనీయ సమాచారంతో తేదీ  07.10.2022 తెల్లవారుజామున చిట్యాల పిఎస్‌ పరిధిలోని ఎన్‌హెచ్ 65 లోని రైల్వే స్టేషన్ వెళ్ళు రోడ్డు వద్ద నిఘా పెట్టీ ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఒక డి.సి.యం   TS-12-UD-2172 మరియు ఒక స్విఫ్ట్ డిజైర్ తెలుపు రంగు కారు నెంబర్ TS-13-EV-2700 లలో ఆపి తనిఖీ చేయగా  గంజాయి ప్యాకెట్లు  మొత్తం 862.350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని  వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు చెప్పిన వివరాల ప్రకారం మహమ్మద్ హైదర్ అలీ, తండ్రి; ఖాదర్ అలీ, అని అందాజ రెండు నెలల క్రితం నాకు డ్రైవింగ్ ఫీల్డ్ లో ప్రతాప్ ద్వారా మహదేవ్ జాదవ్ ,   శివాజీ రాథోడ్, వెంకట రాథోడ్ లు పరిచయం అయినారు. మహదేవ్ జాదవ్ పెట్టుబడి పెట్టి  రాజమండ్రి నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి  అక్రమ గంజాయి వ్యాపారం చేస్తుంటాము అని,   తేదీ 06-10-2022 రోజున ఉదయం శివాజీ రాథోడ్ మహమ్మద్ హైదర్ అలీ కి ఫోన్ చేసి గంజాయి తీసుకొని రావడానికి రాజమండ్రి కి వెళ్ళాలి అని  అందుకని నీతో పాటు గా అదనపు డ్రైవరు  నసీరుద్దీన్ ఆసిఫ్ ను కూడా పంపిస్తున్నాను అని చెప్పగా మహమ్మద్ హైదర్ అలీ సరే అని  నసీరుద్దీన్ ఆసిఫ్ లు  కలిసి డి.సి.యం నెంబర్ TS-12-UD-2172 తీసుకొని రాజమండ్రి కి వెళ్ళి శివాజీ రాథోడ్ ఫోన్ చేయగా అక్కడ శివాజీ కి తెలిసిన రాజమండ్రి దగ్గర చింతూరు లో సురేష్, రమేష్ ల  దగ్గర గంజాయిని తీసుకురమ్మని మహమ్మద్ హైదర్, నజిరొద్దిన్ ఆఫీస్ లకు చెప్పి వెనకాల ఒక స్విఫ్ట్ డిజైర్  కారు నెంబర్ TS-13-EV-2700 గల కారు లో మొత్తం నలుగురు వ్యక్తులు శివాజీ రాథోడ్,  వెంకట రాథోడ్, కారు డ్రైవరు మనోజ్ గురలే, మరియు చింటూ లు కారులో అక్కడికి వచ్చి వారు కారు వెనుక డిక్కీ లో 72 పాకెట్స్  నింపుకొని  తరువాత  డి.సి.యంలో క్యాబిన్ లో ఎవ్వరికీ అనుమానం రాకుండా డిక్కీ తయారు చేసి అందులో 358 పాకెట్స్ లోడ్ చేసుకొని అట్టి కారు  డి.సి.యం కు  ఎస్కార్ట్ గా  భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు వెల్లుచూ ఈరోజు  తేదీ; 07-10-2022 న ఉదయం 7 గంటల సమయంలో   డి.సి.యం లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహమ్మద్ హైదర్ అలీ నసీరుద్దీన్ ఆసిఫ్ మరియు వెంకట రాథోడ్ లను ఆపి తనఖి చేయగా అక్రమ తరలిస్తున్న గంజాయినీ పట్టుబడి చేసి వెనకాల వస్తున్న స్విఫ్ట్ కారులో ఉన్న వారు  పోలీస్ వారు ఆపగా చూసి శివాజీ రాథోడ్,  చింటూ లు పారిపోగా  డ్రైవరు అయిన మనోజ్ గురలే  లను పట్టుకొని కేసు నమోదు   రిమాండ్ పంపనైనది.
 *నిందితుల వివరాలు.* 
1) మహమ్మద్ హైదర్ అలీ తండ్రి ఖాదర్ అలీ, వయసు 41 సం" వృత్తి డ్రైవరు, నివాసం  రంనస్ పూర, ఓల్డ్ సిటీ హైదరాబాద్, 
2)  నసీరుద్దీన్ ఆసిఫ్, తండ్రి; నసీరుద్దీన్ వలి, వయసు; 27" వృత్తి; డ్రైవరు, ప్రస్తుత నివాసం; గుడిమల్కాపూర్, మహెదిపట్నం, హైదరాబాద్, స్వంత నివాసం; మైదుకూరు పట్టణం, కడప జిల్లా, ఆంద్రప్రదేశ్ రాస్ట్రం, 
3) వెంకట్ రాథోడ్ తండ్రి; పండరి రాథోడ్, వయస్సు; 33 సం" నివాసం; జంగిగమ్మ త౦డ, జంగి గ్రామం, శాంతాపూర్ మండల, ఔరాధ తాలూక, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, 
4) మనోజ్ గురలే, తండ్రి; దొండిబా, వయసు; 32  సం" వృత్తి; డ్రైవరు, నివాసం; చూడి బజార్, భేగం బజార్ హైదరాబాద్, స్థిర నివాసం; తడిఖేల్, డెగళూర్ తాలూక, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర.
 *పరారీలో ఉన్న నిందితుల వివరాలు* 
1)మహదేవ్ జాదవ్ 
2)శివాజీ రాథోడ్.
3) సురేష్
4) రమేష్
5) చింటు
 

 ఈ కేసును ఛేదించిన నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి గారి అధ్వర్యంలో చిట్యాల సి.ఐ శివరాం రెడ్డి గారు, చిట్యాల ఎస్.‌ఐ ఎన్. ధర్మ గారు,  HC-1244 శ్రీనివాస్ రెడ్డి, PC-3877 సాయి కుమార్, PC-3838  ఎండి. కలీమ్ మరియు HG-299 యాదయ్య మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందినీ యస్.పి గారూ అభినందిచినారు.
 

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...