బిజెపినీనిలువరించడమే ముందున్న కర్తవ్యం _*-మంత్రి జగదీష్ రెడ్డి*_

 *@నల్లగొండ జిల్లా కేంద్రం నుండి


దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ


విపక్షాల గొంతులు నొక్కేందుకే రాజ్యాంగ సంస్థల వినియోగం


దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విదంగా నిర్ణయాలు


శాంతియుతవాతావరణానికి భంగం వాటిల్ల చేస్తున్న మోదీ సర్కార్


బీజేపీ యోతర రాష్ట్రాలలో అభివృద్ధి,సంక్షేమాలకు కేంద్రం అడ్డుపుల్లలు


బిజెపినీనిలువరించడమే ముందున్న కర్తవ్యం


ప్రగతిశీల శక్తులకు స్నేహ హస్తం


అందుకే వామపక్షాల తో కలసి పోరాటం


మునుగోడు ఉప ఎన్నికల నుండే 


దేశంలో కాంగ్రెస్ బలహీన పడింది


బిజెపిని నిలువరించ గల శక్తి టి ఆర్ యస్ కు మాత్రమే ఉంది


బిజెపి ని వ్యతిరేకించే శక్తులతో కలసి పోరాటం 


 _*-మంత్రి జగదీష్ రెడ్డి*_



===============

నల్లగొండ జిల్లా కేంద్రంలో వామపక్షాలతో మంత్రి జగదీష్ రెడ్డి సమన్వయ సమావేశం


పాల్గొన్న మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు,పల్లా వెంకట్ రెడ్డి లు 


పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు.

===============

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బిజెపి ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిపిఎంకు చెందిన మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి,సీపీఐ కి చెందిన మాజీ శాసనసభ్యులు పల్లా వెంకట్ రెడ్డి,ఉజ్జిని యాదగిరి రావుల తో పాటు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,భోనగిరి యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్, సిపిఐ నల్లగొండ, యాదాద్రి జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం,గోదా శ్రీరాములు లు టి ఆర్ యస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి వామపక్షాలతో కలసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపిని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.శాంతియుత వాతావరణాన్నీ చెడగొడుతూ ప్రజల మధ్యన విచ్ఛిన్నానికి బిజెపి కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. అంతటితో ఆగని మోదీ సర్కార్ తెలంగాణాతో సహా బిజెపి యోతర రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతుందని ఆయన మండిపడ్డారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రజలు తెలంగాణా లో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు కావాలంటూ వస్తున్న డిమాండ్ లే కేంద్రం తెలంగాణా పై కక్ష పూరితంగా వ్యవరించేందుకు కారణమని ఆయన చెప్పారు.అటువంటి బిజెపి ని ఉపేక్షించుకుంటూ పోతే దేశం ప్రమాదం అంచుకు చేరే ప్రమాదం ఉందన్నారు. అటువంటి బిజెపి ని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. ఆ శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టి ఆర్ యస్ పార్టీకే ఉందన్నారు.అందుకు తోడ్పాటు నందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోవాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.అందుకు మునుగోడు ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకొని వామపక్షాలతో కలసి బిజెపి పై పోరాటానికి శ్రీకారం చుట్టమన్నారు.దేశంలో కాంగ్రెస్ బలహీన పడిందని బిజెపిని బలంగా వ్యతిరేఖించే శక్తులను కలుపుకోవడంలో భాగంగ వామపక్షాలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు.అందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పై నుండి మారుమూల కుగ్రామం వరకు ఈ సమన్వయం కొనసాగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.


*బిజెపి తో దేశానికి ప్రమాదకరం*


*అందుకే టి ఆర్ యస్ తో కలసి పోరాటం*


*-పల్లా వెంకట్ రెడ్డి*

*-సీపీఐ*

మాజీ శాసనసభ్యులు

భారతీయ జనతాపార్టీ తో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ కి చెందిన మాజీ శాసనసబ్యులు పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు.కేంద్రంలో కొలువుదీరిన ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పెదప్రజలకు భారంగా సంక్రమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి కి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో గుర్తించమన్నారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడడంతో టి ఆర్ యస్ తో కలసి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బిజెపి ని అడ్డుకునే శక్తి టి ఆర్ యస్ కున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందించినట్లు పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు.

         ****

*బిజెపి ని ఓడించే శక్తి టి ఆర్ యస్ కుంది*


*-చెరుపల్లి సీతారాములు*

*-సిపిఎం*

మాజీ శాసనమండలి సభ్యులు

మునుగోడు ఉప ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపిందని మాజీ శాసనమండలి సభ్యులు, సిపిఎం నేత చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. దీనికున్న ప్రాధాన్యత దృష్ట్యా బిజెపి ని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తులుపై పడిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బిజెపి ని ఓడించగల శక్తి సామర్ధ్యాలు ఒక్క టి ఆర్ యస్ కే ఉన్నందున మునుగోడు లో జరగనున్న ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ ను బలపరచాలని సిపిఎం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్ యస్ యస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న బిజెపి కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...