:
పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుదాలు , వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన*
*జిల్లా యస్ పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్*
*జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు*
జిల్లా పోలీస్ కార్యాలయం నేడు విజయ దశమి సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని సాయుధ కార్యాలయంలో ప్రత్యేక ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు,అధికారులకు మరియు సిబ్బందికి విజయ దశమి శుభకాంక్షలు తెలుపుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు
విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలకు, వాహనాలకు, ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయమే విజయ దశమి అని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తెలియజేశారు. ఈ విజయ దశమి నుంచి మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయాలు కలగాలని.. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డి.యస్.పి సురేష్ కుమార్ అడ్మిన్ ఆర్. ఐ హరిబాబు,యం.టి.ఓ శ్రీనివాసు,వెల్ఫేర్ ఆర్. ఐ సంతోష్, ఆర్.యస్.ఐ లు రాజీవ్, కళ్యాణ్ రాజ్,అఖిల్, శ్రావణి,జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు జయరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.