నవంబర్ 10 నుండి నల్లగొండ హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు....
ఘనంగా ఏర్పాట్ల కొరకు అధికారులను ఆదేశించిన కంచర్ల..
లతీఫ్ సాహెబ్ గుట్టపై కోటి రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో అభివృద్ధి పనులు...
గుట్ట పైకి ఘాట్ రోడ్డుపై మరోసారిఅధికారులతో సర్వే
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నల్లగొండలో.. హజరత్ ఘర్ ఏర్పాటుకు కృషి... .mla కంచర్ల.
నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ...
సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి.. ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై.. లతీఫ్ సాబ్ గుట్ట మెట్ల వద్ద సమావేశం ఏర్పాటు చేశారు...
నవంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుటకు గాను... అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, గత సంవత్సరం 44 లక్షల రూపాయల వ్యయంతో గుట్టపైకి పైప్లైన్ ట్యాంకు ఏర్పాటు చేశామని.. మరుగుదొడ్లు అవి ఇంకా నిర్మాణం పూర్తి చేయాల్సిఉందని,,
ఎస్ డి ఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించి గుట్టపై అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు....
గుట్ట పైకి ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తామని తాము హామీ ఇచ్చామని.. తాము గతంలో సర్వే నిర్వహించి ఆర్ అండ్ బి వారితో కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ పంపించామని.. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇది వక్ఫ్ బోర్డ్ సంబంధించిన ఆస్తులని ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్ట వద్దని కంప్లైంట్ ఇచ్చారని... దానితో కొంత ఆలస్యమైంది తప్ప ఘాట్ రోడ్ నిర్మాణం ఆగదని... త్వరలోనే మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయి సర్వే నిర్వహించి... ఘాట్ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు.
అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నల్లగొండలో హజ్ ఘర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు...
కొందరు తనను బదనాం చేసే విదంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారని... ఇలాంటి పద్దతి మంచిది కాదని mla గా అందరిని కలుపుకు పోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. ముస్లీమ్ ల అభివృద్ధి కొరకు తన పూర్తి సహకారం ఉంటుందని, ఘాట్ రోడ్ తో పాటు, ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈద్ గా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని నల్లగొండ నలు వైపుల నుండి సర్వంగసుందరంగా పట్టణం తయారు కాబోతుందని...అన్నారు.
ఉర్సు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని..
అన్ని మతాలవారు ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారని కాబట్టి ఏర్పాట్లను ఘనంగా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు..
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె వి రమణాచారి, పలువురు మత పెద్దలతో పాటు...
ఉర్సు కమిటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ జాఫర్, స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్, మాతంగి సత్యనారాయణ,జమాల్ ఖాద్రి, వాజిద్, జాహీద్ , లతీఫ్, అవేస్, తోపాటు వివిధ పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.