57 సంవత్సరాలు నిండిన వారికందరికి పెన్షన్ లు మంజూరి నల్లగొండ శాసనసభ్యులు కాంచన భూపాల్ రెడ్డి

 ప్రెస్ నోట్...

 ఆ.. అవ్వల ముఖంలో కళ చూడండి..

ఏదో గొప్ప విజయం సాధించినట్లు... ఎంతో గౌరవం పొందినట్లు...

తృప్తిగా లేరూ...

అవును....

కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం..57 సంవత్సరాలు నిండిన వారికందరికి పెన్షన్ లు మంజూరి చేస్తూ....

నేడు నల్లగొండ శాసనసభ్యులు కాంచన భూపాల్ రెడ్డి




గారు... పట్టణంలోని.. 1,2, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 26, 27, 28, 29,...  వార్డులలోని.. లబ్ధిదారులకు.. పెన్షన్ కార్డు మరియు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.

 ఆయా ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కంచర్ల...

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంబండ వర్గాల సంక్షేమాన్ని, దృష్టిలో ఉంచుకొని.. ఆసరా పెన్షన్లు మంజూరు చేశారని.. ఇప్పుడుఇచ్చిన మాట ప్రకారం 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించడం తో ఎంతోమంది వృద్ధులకు, లాభం జరుగుతుందని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండుతున్నాయని, ఆసరా పెన్షన్లు కొత్తవి ఇవ్వడం తో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని కెసిఆర్ కుటుంబ పెద్దలా  అందరి సంక్షేమాన్ని చూస్తున్నారని... వారికి మీ ఆశీర్వాదాలు కావాలని, వారి నాయకత్వాన్ని మరింత పటిష్ట పరచవలసిన అవసరం ఉందని అప్పుడే ఈ రాష్ట్రానికి, మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉందని  అన్నారు.... ఆయా ప్రదేశాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కె.వి రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,కౌన్సిలర్లు, ఆలకుంట మోహన్ బాబు, జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, ఊట్కూరు వెంకటరెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, బోయినపల్లి శ్రీనివాస్, సమీయుద్దీన్,బషీరుద్దీన్, సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి,నాయకులు.. పిన్నపురెడ్డి, మదుసూదన్ రెడ్డి సంధినేని జనార్దన్ రావు,దొడ్డి రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...