శ్రీ గణేష్ బిగాల గారికి అభినందనలు తెలియచేసిన నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు మరియు కార్పొరేటర్లు...
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజమాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దరని శ్రీ కేసీఆర్ గారు కితాబిచ్చారు, అనంతరం అదనంగా 100 కోట్ల నిధులను నగర అభివృద్ధి కొరకు ప్రకటించిన నేపథ్యంలో, నిజమాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఇద్రీస్ ఖాన్ గారు మరియు కార్పొరేటర్లు, తెరాస నాయకులు గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారిని క్యాంపు కార్యాలయంలో బొకే మరియు శాలువలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.