పంచముఖ హనుమాన్ దేవాలయంలో మట్టి గణపతికి తొలి పూజ చేసిన కంచర్ల..

 ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం..


 పంచముఖ హనుమాన్ దేవాలయంలో మట్టి గణపతికి తొలి పూజ చేసిన కంచర్ల..




 47 వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే...


 నియోజకవర్గ వ్యాప్తంగా 500 కు పైగా గణేష్ విగ్రహాలను భక్తులకు అందజేసిన కంచర్ల..


 గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని  ప్రజలకు విజ్ఞప్తి..


 గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు...


 ప్రజలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరుగకుండా నల్లగొండ మున్సిపాలిటీ ప్రత్యేక ఏర్పాట్లు...


 నేడు..నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ వీటి కాలనీలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో మట్టి గణపతికి.. వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి తొలి పూజ నిర్వహించారు...


 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనాతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోలేకపోయామని.. భగవంతుని దయవలన ప్రస్తుతానికి ఆ ఉపద్రవం తొలగిపోయినందున..

 వర్షాలు సమృద్ధిగా పడుతున్నందున మంచి పంటలు పండే అవకాశం ఉన్నందున..

 వినాయకునికి అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు జరుపుకొవాలని ప్రజలను కోరారు..

 తాను ఇప్పటికే నల్లగొండ నియోజక వ్యాప్తంగా 500 పైగా విగ్రహాలను ఉచితంగా భక్తులకు అందజేశానని.. భక్తులంతా ప్రశాంత వాతావరణంలో పూజలు జరుపుకొవాలని కోరారు...

 అన్ని మతాలవారు వారి వారి పండుగలను సోదర భావంతో అందరితో కలిసి జరుపుకునే మంచి సాంప్రదాయం నల్గొండ పట్టణంలో ఉన్నదన్నారు..

 గణేష్ నవరాత్రుల సందర్భంగా.. ప్రజలు భక్తులు కూడా.. పోలీసులు అధికారుల సూచనలు పాటించి వారికి సహకరించవలసిందిగా.... విజ్ఞప్తి చేశారు అనంతరం 47 వ వార్డు విద్యానగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో పాటు.. అధికారులు.. మున్సిపల్ కమిషనర్  కెవి రమణ చారి, డి.ఎస్.పి  నరసింహారెడ్డి 

 మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్.. సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్.. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, మారగోని గణేష్ జేరిపోతుల భాస్కర్ గౌడ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరి వెంకట్ రెడ్డి, ఆలకుంట్ల మోహన్ బాబు,గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి నాయకులు, బకరం వెంకన్న, రావుల శ్రీనివాసరెడ్డి మిరియాల యాదగిరి, మేడ మోహన్ రెడ్డి, చకిలం వేణుగోపాలరావు  దోనాల నాగార్జున్ రెడ్డి, సూర మహేష్ వీరాచారి తుమ్మల గోవిందరెడ్డి గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...