ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.
నల్గొండ: నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్లో జాతీయ జెండాను అధ్యక్షుడు యమా మురళి ఆవిష్కరించారు. అనంతరం రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కార్పొరేషన్ ఏర్పాటుకు నాయకులకు సద్బుద్ధి కల్పించాలని వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో కోటగిరి చంద్రశేఖర్, వీరెల్లి సతీష్, వనామా మనోహర్, ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్, నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ, నల్గొండ యోగీశ్వర్, నాంపల్లి నర్సింహ, కోటగిరి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.