రేపు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం చేద్దాం..
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి
ఐ.పి.యస్*
స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో రేపు నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపన జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా యస్.పి గారు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఉదయం 11.30 గంటలకు అన్ని ట్రాఫిక్ కూడళ్లు, గుర్తింపు పొందిన ప్రదేశాలు,విద్యాలయాలు,ప్రభుత్వ కార్యాలయాలు,వంటి అన్ని చోట్ల ప్రజలు,ప్రజా ప్రతినిధిలు అధికారులు,యువత,విద్యార్థులు, కార్మికులు ప్రతీ ఒక్కరూ జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పాల్గొని జాతీయ గీతాలాపన విజయవంతం చేయాలని కోరారు. పట్టణ ప్రధాన కూడళ్లలో సరిగ్గా ఉదయం 11.25 నిమిషాలకు ట్రాఫిక్ నిలిపివేయాలని ఎక్కడి వారు అక్కడ నిలబడి నిశబ్దంగా జాతీయ గీతాలాపనలో పాల్గొని దేశ భక్తిని చాటాలని, చరిత్రలో భారత దేశ ప్రక్యాతిని చాటి చెప్పాలని అన్నారు.