సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.*
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్*
*కోర్టు ఉత్తర్వులు ప్రకారం 10 క్వింటాళ్ల 48.355 కేజీల గంజాయి దగ్దం..*
*గంజాయి అక్రమ రవాణ చేస్తే కఠిన చర్యలు.*
గత కొంత కాలంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 10 కింటాల 48.355 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేడు నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా యస్.పి, డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యస్.పి గారూ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 51 కేసులలో 1048.355 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగింది అని,యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని,జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆశ్వాక్, యస్.బి డి.యస్.పి రమేష్, నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి, మిర్యాలగూడ డి.యస్.పి వెంకటేశ్వర రావు,డి.టి.సి డి.యస్.పి వెంకట రమణ, ఆర్.ఐ కృష్ణా రావు,యస్. ఐ వెంకటేశ్వర్లు, ఆర్.యస్. ఐ లు కళ్యాణ్,రాజీవ్ లు పాల్గొన్నారు.