*స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించాలి.*
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ. పి.యస్*
నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 75 వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని జిల్లా యస్.పి గారూ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే భారత స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో 11 వ తేదీన నిర్వహించే 2 కే ప్రీడం రన్ ఉదయం 8 గంటలకి నల్లగొండ పట్టణంలోని వారికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభం కానున్నది.అలాగే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒకే సమయంలో ప్రారంభించనున్నారు. మరియు 16 వ తేదీన జాతీయ గీతాలాపన నిర్వహించనున్నారు. కాబట్టి జిల్లా యువత,విద్యార్థులు ఉద్యోగులు,ప్రజలు వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించే కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొనీ దేశ భక్తి నీ పెంపొందించేలా మన జాతీయ గీతాలపన ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా భారత దేశం చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు నరసింహ రెడ్డి, వెంకటేశ్వర రావు,సురేష్ కుమార్, వెంకట రమణ సిఐ రమేష్ అర్.ఐ లు హరిబాబు,సంతోష్ లు పాల్గొన్నారు.