మహిళ
బరోసా సెంటర్స్ ఏర్పాటు దేశానికే ఆదర్శం.*
జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ. పి.యస్
- *లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి.*
ఈ రోజు మహిళా బరోసా సెంటర్ ను ఏర్పాటు చేసి సంవత్సరం సందర్బంగా ఎస్పీ గారు కేకు కట్ చేసి మాట్లాడుతూ మహిళల రక్షణగా, పిల్లల పై లైంగిక దాడుల నివారణ, నిరాదరణ దాడులకు గురైన మహిళలకు, పిల్లకు అండగా ఉండడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ ఈ బరోసా సెంటర్స్ దేశంలోనే మన రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగినది అన్నారు. బరోసా సెంటర్స్ నిర్వహణ దేశానికే ఆదర్శం అని అన్నారు. లైంగిక దాడులు జరిగితే దైర్యంగా పిర్యాదు చేయాలని ఎస్పీ గారు అన్నారు. బాధితులకు బరోసా సెంటర్ అండగా ఉంటుందని వేదింపులు, హత్యాచారం, బాధిత మహిళలకు, పిల్లకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది అని జిల్లా ఎస్పీ గారు అన్నారు. ఈ యొక్క బరోసా సెంటర్ ఏర్పాటు చేసినప్పటి నుండి 2021 year లో 44 కేసులు 2022 జనవరి నుండి ఇప్పటి వరకు 89 కేసులు మొత్తం 133 కేసులు నమోదు కాబడినవి అన్నారు. ఇందులో 21 మందికి పరిహారం అందేలా కృషి చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో షి టీమ్ ఇంఛార్జి సి. ఐ రాజశేఖర్ గౌడ్ మహిళా ఏ యస్. ఐ లు అబేద,విజయ లక్ష్మి, బరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని, లీగల్ కౌన్స్లర్ కల్పన, ప్రేమలత,మానస,నిరశ్,నవ్య లు పాల్గొన్నారు.