*యువతి పైన హత్యాయత్నం చేసిన నిందితుడు అరెస్ట్ ..*
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్*
*ప్రేమ పేరుతో వేదింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు* .
తేదీ .09.08.2022 రోజున నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ పార్క్ నందు ప్రేమ పేరుతో యువతిపైన హత్య యత్నం చేసిన నిందితుడి పైన Cr.No 199/2022 U/s 307 IPC క్రింద కేసు నమోదు చేసి విచారించగా నిందితుడు మీసాల రోహిత్ కుమార్ తండ్రి యేసు రత్నం R/O అబ్బాసియా కాలనీ నల్లగొండ పట్టణం గత కొన్ని నెలలుగా బాధితురాలిని ప్రేమ పేరుతో వేదింపులకు గురి చేస్తూ బాధిత అమ్మాయి ఒప్పుకోక పోవడంతో నిన్న మధ్యాహ్నం నల్లగొండ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీసు పార్క్ వద్ద కు రోహిత్ తన స్నేహితుడి ద్వారా బాధితురాలుకు ఫోన్ చేయించి రమ్మనగా బాధితురాలు తన స్నేహితురాలుతో కలిసి పార్క్ వద్ద వెళ్లి కొద్ది సేపు అందరూ కలిసి మాట్లాదిన తరువాత, అనంతరం బాధితురాలితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పక్కకు తీసుకెళ్లిన నిందితుడు అకస్మాత్తుగా కత్తితో నోరు, గొంతు, పొట్ట, రెండు కాళ్లు, చేతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేచి. అదే రోజు రాత్రి నిందితుడు పరారీలో ఉండగా ఊరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును డీఎస్పీ స్థాయి సీనియర్ అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించామని, ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తామని ఎస్పీ తెలిపారు. నిందితుడిని ఈరోజు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో శాస్త్రీయంగా, వృత్తిపరంగా సకాలంలో విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి భద్రత మరియు పూర్తి సహాయాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుత 2022 సంవత్సరంలో షీ టీమ్స్ కు నల్గొండలో ఇప్పటివరకు (242) అర్జీలు వచ్చాయని (28) ఎఫ్‌ఐఆర్‌లు జారీ చేయబడ్డాయి, (70) చిన్న కేసులు నమోదు చేయబడ్డాయి, (208) మందికి కౌన్సెలింగ్ ఇవ్వబడ్డాయి, (11) మంది మైనర్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించడం జరిగిందని, మహిళలు మరియు పిల్లలపై నేరాల పట్ల (530) అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి (1300) హాట్ స్పాట్‌లను గుర్తించి అక్కడ అను నిత్యం నిఘా ఏర్పరిచి SHE టీమ్‌లు సందర్శించి (25) మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాని, ఇలాంటి నేరాన్నిగురించి ప్రజలు జిల్లా యస్.పి గారికి 24/7 సెల్ నెం.9963393970లో సంప్రదించవచ్చునని, ఆడపిల్లలను/మహిళలను వేధించినా, సైబర్ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ,ఇలాంటి కేసులను నిర్భయంగా ఫిర్యాదు చేసేలా తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని అన్నారు .