తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా నల్గొండ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తుంది
యాంకర్ పార్ట్ : తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా నల్గొండ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్ బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కొట్లాట సీఎం కెసిఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే అవుతారని హెచ్చరించారు. జీవో నెంబర్ 246 ని వెంటనే రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధమని చెప్పారు. కృష్ణా నది నుండి ఏపీ సీఎం జగన్ రోజుకు 8 నుండి 11 టీఎంసీల నీటిని తోడుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోందన్నారు. జీవో రద్దు చేయాలనీ సీఎం కెసిఆర్ కి లేఖ రాస్తా అని అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని తెలిపారు. ఎస్ఎల్ బీసీ 30 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40, డిండి ఎత్తిపోతలకు 20 టిఎంసిలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బైట్... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ భువనగిరి.