*కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు*
-జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ
.పి.యస్
Ø *కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.*
Ø *బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వవాహన.*
తేదీ: 28-08-2022 ఆదివారం నాడు నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్షకు పరీక్షా కేంద్రాల వద్ద దాదాపు 500 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తూ నిర్వహీస్తున్నాము అని జిల్లా యస్.పి గారు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రేపు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షకు, నల్లగొండ జిల్లాలో మొత్తం 33327 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకారున్నారని, నల్లగొండ జిల్లాలో మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇందులో నల్లగొండ పట్టణంలో 62 పరీక్షా కేంద్రాలు నకిరేకల్ పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు మిర్యాలగూడ పట్టణంలో 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగుతుంది అని రేపు ఉదయం 0600 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో ఉంటుందని మరియు పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని,పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని పరీక్షలకు పటిష్టమైన బంధుబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అబ్యర్డుల పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవడాని ఉదయం 4.00 గంటల నుండి ఆర్.టి.సి బస్ ల సౌకర్యం ఉంటాయి అని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉండే విదంగా ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. అబ్ద్యర్డులు పరీక్షా సమయాని కంటే 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని,మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
*కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు*
· పరీక్ష వేళలు: ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.
· విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 9:00 గంల వరకే చేరుకోవాలి.
· ఉదయం 10:00 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి.
· ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.
· పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు,సెల్ ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు,వాచ్లు,క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు
· అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్,మరియు పెన్ మాత్రమే తీసుకురావాలి.
· పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్స్ Laptop లు పెట్టుకోవడానికి ఎటువంటి Cloak Room సదుపాయాలు ఉండవు.
· అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి. లేనిచో పరీక్షకు అనుమతించరు.
· అభ్యర్థులు తమ హాల్ టికెట్ వెనుక బాగంలో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.
· హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్లు అవసరం లేవు.
· పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి.
· ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ,టాటూలూ వేసుకొని పెట్టుకోవద్దు.
· పరీక్ష 200 అబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి (A,B,C,D ప్రశ్నా పత్ర కోడ్ వేర్వేరుగా). 200 మార్కులు
· పరీక్ష 200 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంకి 0.2 మార్కు కట్ అవుతుంది.
· పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.
· అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు కేటాయించిన సీటు వద్దకు చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి..
· ఎగ్జామ్ విధి నిర్వాహణలో ఉన్నవారు తప్ప ఎవరినీ పరీక్ష మెయిన్ గేట్ దాటి లోపలికి అనుమతించబడరు.
పోలీసు పి.ఆర్.ఓ
జిల్లా కార్యాలయం నల్లగొండ. .