"నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీస్"..
.
పొగొట్టుకున్న పర్సును భాదితుడికి అప్పగింత"...
కనగల్ (మం) పర్వతగిరికి చెందిన కదిరి నాగరాజు, నల్గొండ కోర్టుకి హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో పర్సు కిందపడిపోయింది.అందులో ఏటీఎం కార్డు ,పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ,ఓటర్ కార్డుతో పాటు రూ 5,100 నగదు ఉంది.విధుల్లో భాగంగా అటుగా వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గోవిందుకి ఆ పర్సు దొరికింది.పర్సులో కోర్టుకు హాజరైన లెటరు ఆధారంగా భాదితుడు ట్రేసవుట్ అయ్యాడు.దాంతో వెంటనే అతడికి సమాచారం చేరవేశాడు. భాదితున్ని పిలిపించి,ట్రాఫిక్ సీఐ సమక్షంలో పర్సును అప్పగించాడు కానిస్టేబుల్ గోవింద్.కాగా నిజాయితీగా పర్సును అప్పగించిన కానిస్టేబుల్ గోవింద్ ను ట్రాఫిక్ సీఐ మరియు తోటి సిబ్బంది అభినందించారు.