*@జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి*
_*అందుబాటులోకిఆధునిక పరిజ్ఞాన వైద్యం
*
_
$అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్లు
#సామాన్యుడికి కార్పోరేట్ వైద్యం
#ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
_*-కంచర్ల భూపాల్ రెడ్డి*_
**********************
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు
ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజకుమారి, సూపరెండేంట్ డాక్టర్ లచ్చు తదితరులు
**********************
కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు రూపొందుతున్నాయని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. అంతకు మించి వైద్య సదుపాయాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలోనే లభిస్తున్నాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంతో అత్యాధునిక అరికారాలతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. సామాన్యుడికి కార్పోరేట్ వైద్యం అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు.జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్య సేవలు అప్డేట్ అవుతున్నాయన్నారు.అందులో భాగంగానే చెవి,ముక్కు,గొంతు లకు సంబందించిన ఆపరేషన్ థియేటర్లు ఈ రోజు ప్రారంభించుకున్నామన్నారు.యింకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండేంట్ డాక్టర్ రాజకుమారి,సూపరెండేంట్ డాక్టర్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.
*****