నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో రైతు రచ్చబండ,కాంగ్రేస్ పార్టీ బలోపేతం అజెండాగా కాంగ్రేస్ పార్టీ (అన్ని మండలాల)విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
....
ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్:
👉దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది..
👉రాష్టంలో రైతులు పండించిన పంటకు నే దిక్కు లేకుండా పోయింది..
👉ఇక్కడ చేతగాని ముఖ్యమంత్రి రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తారు. అక్కడ చేతగాని ప్రధానమంత్రి బిజెపి వాళ్లు ఇక్కడ గల్లీలో ధర్నాలు చేస్తున్నారు.
👉కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ రైతుల కోసం పనిచేసే పార్టీ అందుకోసమే రైతుల కోసం ముందుగా మద్దతు ధరను డిక్లేర్ చేశాము.
👉 దేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు..
👉ఈ డిసెంబర్ లో ఎన్నికలు వచ్చినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు.
👉రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కుంటుబడి పడిపోయినాయి.
👉సీఎం కేసీఆర్ ఒక ఇల్లు కట్టి పేదలకు పంచిన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి.
👉 కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తే ఆయనకే ఓటు వేయండి.
👉ఇవ్వాళ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే పక్క రాష్టం నుంచి వచ్చిన పీకే ఇచ్చే దుస్థితి ఏర్పడింది..
👉9 సంవత్సరాలలో తెలంగాణ ను అభివృద్ధి చేస్తే పికే తో పని ఏముంటుంది కేసీఆర్ కు
👉మోదీ ప్రభుత్వము దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబ సభ్యులను ఈ డి పేరుతో వేధిస్తూ. కాళేశ్వరం పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు వదిలేశారు సమాధానం చెప్పాలి
👉ప్రజల కోసం ప్రధానమంత్రి పదవి నీ వదిలేసిన గొప్పనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
👉హైదరాబాద్ నడిబొడ్డున ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు, హోంమినిస్టర్ మనవడు అత్యాచారం చేస్తే దాని పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు కేటీఆర్ చెప్పాలి
👉ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ మారితే పార్టీ మారిన నాయకుల రెండు చేతులు నరకాలి..