నల్గొండ మున్సిపల్  క్వార్టర్స్ కు సంబంధించిన స్థలంలో  కబ్జా చేసి చేపట్టిన  నిర్మాణాలను మున్సిపల్  అధికారులు శనివారం జెసిబి చే తొలగింప చేశారు.

 నల్గొండ మున్సిపల్  క్వార్టర్స్ కు సంబంధించిన స్థలంలో  కబ్జా చేసి చేపట్టిన  నిర్మాణాలను మున్సిపల్  అధికారులు శనివారం జెసిబి చే తొలగింప చేశారు.



ఆయన శుక్రవారం ఉదయం మున్సిపల్ క్వార్టర్స్ ను ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ ,విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు . పరిశీలనలో  మున్సిపల్ స్థలం ఆక్రమణకు  గురైనట్లు గుర్తించారు. సంబంధిత  యజమానుల ను కలిసి అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా  తొలగించుకోవాలని, లేదంటే తాము తొలగించాల్సి వస్తుంది అని తెలిపారు. ఒక్కొక్క రోజు గడువు ఇచ్చినప్పటికి  తొలగించుకోక పోవడం తో.. శనివారం ఉదయం వాటిని జెసిబి తో తొలగింప చేశారు. ఇకపోతే  క్వార్టర్స్  ఎవరికి కేటాయించబడింది.. ప్రస్తుతం ఎవరు ఉంటున్నారు..? ఏమైనా క్రయ విక్రయాలు  జరిగాయా.. ?ఇంకా ఏమైనా ఆక్రమణకు గురి అయ్యావా ? అన్న విషయాలపై పూర్తిగా సర్వే చేయాలని సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం కి సూచించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...