38వ వార్డు లో మున్సిపల్ కమీషనర్ డా.కె.వి.రమణాచారి గారు కౌన్సిలర్ బోయినపల్లి శ్రీను,  మున్సిపల్ అధికారులు

4వ విడత పట్టణ ప్రగతి లో భాగంగా 38వ వార్డు లో మున్సిపల్ కమీషనర్ డా.కె.వి.రమణాచారి గారు కౌన్సిలర్ బోయినపల్లి శ్రీను,  మున్సిపల్ అధికారులు


,38వ వార్డు ప్రజలు పాల్గొని మొక్కలు నాటి నీళ్ళు పోయడం జరిగినది, ఈ సందర్భంగా కమీషనర్ డా.కె.వి.రమణాచారి గారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతిఇంటికి మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరు విధిగా రెండు మొక్కలను నాటాలని, 38వ వార్డులో హారిత ప్రేమికులైన ముసుగు జగన్ మోహన్ రావు కవిత, లింగారెడ్డి లక్ష్మి దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది, ఇంటింటి చెత్త సేకరణ లో భాగంగా తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, డ్రైనేజీ కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ , ఇంజనీర్లు వెంకన్న ,అశోక్ , దీపక్ , శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి మరియు వార్డు పెద్దలు కట్టా వెంకట్ రెడ్డి, ఈశ్వరయ్య, లింగయ్య, నాగేశ్వర్ రావు, చంద్రా రెడ్డి, రవికుమార్, జగన్, చైతన్య, పవన్, సురేఖా, రత్నమాల, సునీత, కవిత పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...