అక్రిడేషన్ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపిన రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి

 తెలంగాణ చిన్న మధ్య తరహా దిన మరియు మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 ను పురస్కరించుకొని పీరియాడికల్ పత్రికలకు కూడా ప్రకటనలు జారీ చేస్తామని హామీ ఇచ్చినారు ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పీరియాడికల్ పత్రికలకు అక్రిడేషన్ కార్డుల జారీ చేయాలని కోరగా ఈనెల 20వ తేదీన రాష్ట్ర  వ్యాప్తంగా రెండు సంవత్సరాల కొరకు నూతన అక్రిడేషన్ కార్డులు జారీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోమని గ్రేడింగ్ ఫైల్ కమిషనరేట్ పరిధిలో ఉందని త్వరలో వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ ఉపాధ్యక్షులు సోమవరపు యాదయ్య, నజీమ్  రాష్ట్ర ప్రచార కార్యదర్శి  కొమర్రాజు  శ్రీనివాస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎం డి మసూద్ గిరిజన సాంస్కృతిక పత్రిక ధర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...