*వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచే పోటీ చేస్తా*
*ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
*నూతన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు.
*మర్రిగూడ బైపాస్ నుంచి భారీ ర్యాలీ*
*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కోమటిరెడ్డి అభిమానులు.
_______________________________వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు' అభిమానుల సమక్షంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ తనకు గుండెకాయ అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని మరోమారు ఆయన వెల్లడించారు.గత 20ఏళ్లుగా నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ జీవితం ప్రసాదించారని అన్నారు.తాను భువనగిరి ఎంపీగా ఉన్నప్పటికీ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని సీఎం పేర్కొనడంతో ప్రజలు తనను ఓడించారని అన్నారు.
సిఎం కెసిఆర్ నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ లన్నింటినీ విస్మరించారని ధ్వజమెత్తారు.
రోడ్లు బాగు చేసినంత మాత్రాన మొత్తం అభిరుచి జరిగినట్లా అని ఆయన ప్రశ్నించారు.జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.చేతగాని మంత్రి అని ధ్వజమెత్తారు.తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
స్టార్ క్యాంపెనయిర్ గా తాను 40మంచి 50 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుంటానని అన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు మర్రిగూడ బైపాస్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి భారీ గజమాల వేశారు.అనంతరం అక్కడి నుంచి నూతన క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య' ఎంపీపీ మనిమద్ది సుమన్,ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల అయిలయ్య, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి పటేల్ రమేష్ రెడ్డి, జిల్లేపల్లి ,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్ ,కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ ,వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్ , పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.